పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి ఆశలు అడియాశలు అయ్యాయి. నోటుకు ఓటు కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేయడంతో రేవంత్ భవితవ్యంపై నీళ్లు చల్లినట్లు అయింది. టీపీసీసీలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీలో చేరకముందే పీసీసీ అధ్యక్ష పీఠం పై కన్నేసిన రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి చిరకాల వాంఛ కానుంది.
కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులుంటాయో తెలియంది కాదు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ఎన్ని అవాంతరాలు దాటాలో తెలియంది కాదు. అయినప్పటికి కాంగ్రెస్ లో తన ప్రభావాన్ని చూపించడానికి రేవంత్ ఎన్నో పాట్లు పడ్డారు. అయినా లాభం లేకపోయింది. కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయిపో యింది.
ఆరు మాసాలుగా పార్టీ ప్రెసిడెంట్ గా ప్రకటించడానికి అధిష్టానం ప్రయత్నించడం, నేతలు వాయిదా వేయంతోనే కాలం గడిచిపోయింది. చివరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత ప్రె సిడెంట్ ు ప్రకటించమని జానారె డ్డి కోరినా సానుకూలంగా స్పందించలేదు. నేడో రేపో ప్రకటిస్తారని తెలిసే లోపే నోటుకు ఓటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు దాఖలు చేసింది.
చార్జిషీటులో రేవంత్ రె డ్డిపై అనేక అభియోగాలు చేసింది. కుట్రలో రేవంత్ ప్రధాన సూత్రధారిగా ఈడీ పేర్కొంది. ఈ కేసులో రేవంత్ అరెస్టు తప్పేట్లు లేదు. ఇప్పటికి అరెస్టయిన రేవంత్ బెయిల్ పై బయట తిరుగుతున్నారు. చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ రద్దు అయినా చేయవచ్చు. ఈ పరిస్థితుల్లో రేవంత్ పీసీస పగ్గాలు చేపట్టడం ఇప్పట్లో అసాధ్యమని తెలుస్తోంది.