Revanth Reddy: రేవంత్ రెడ్డి దూకుడుకు అధిష్టానం కళ్లెం వేసిందా?

Revanth Reddy: రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక తనదైన శైలిలో దూసుకుపోయారు. పార్టీలో ప్రక్షాళన చేపట్టే దిశగా వ్యూహాలు రూపొందించారు. వ్యతిరేకులను సైతం పట్టించుకోలేదు. దీంతో వారంతా రేవంత్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు లు చేశారు. దీంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని భావించింది. ఇందులో భాగంగా రాజకీయ వ్యవహారాల కమిటీ పేరుతో కొత్తగా ఓ కార్యవర్గాన్ని నియమించింది. దీంతో భవిష్యత్తులో రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. […]

Written By: Raghava Rao Gara, Updated On : September 15, 2021 5:56 pm
Follow us on

Revanth Reddy: రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక తనదైన శైలిలో దూసుకుపోయారు. పార్టీలో ప్రక్షాళన చేపట్టే దిశగా వ్యూహాలు రూపొందించారు. వ్యతిరేకులను సైతం పట్టించుకోలేదు. దీంతో వారంతా రేవంత్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు లు చేశారు. దీంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని భావించింది. ఇందులో భాగంగా రాజకీయ వ్యవహారాల కమిటీ పేరుతో కొత్తగా ఓ కార్యవర్గాన్ని నియమించింది. దీంతో భవిష్యత్తులో రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి వర్గాన్ని రాహుల్ గాంధీ హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీ నేతలను అందరిని కలుపుకుని వెళ్లాలని సూచించినట్లు సమాచారం. లేకపోతే మన మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం తనకు అధిష్టానం మద్దతు ఉందని ప్రచారం చేసుకున్నా అసలు నిజం వేరేలా ఉందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తోక కట్ చేసేందుకు ఢిల్లీ పిలిపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీలో ఎన్నడు లేని విధంగా రాజకీయ వ్యవహారాల కమిటీ అని కొత్తగా వేశారు. ఇందులో రేవంత్ రెడ్డి వ్యతిరేకులకే స్థానం కల్పించారు. మాణిక్యం ఠాకూర్ చైర్మన్ గా షబ్బీర్ అలీ కన్వీనర్ గా నియమించారు. ఇందులో రేవంత్ రెడ్డి ఓ సభ్యుడు మాత్రమే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్ సహా ఆయనను వ్యతిరేకించే వారికే స్థానం దక్కింది. దీంతో రేవంత్ రెడ్డి దూకుడును కట్టడి చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపై కాంగ్రెస్ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనుమతులు తీసుకోవాల్సిందే. దీంతో రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో సీనియర్లు అసంతృప్తికి లోనయ్యారు. దీంతో వారి సూచన మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీలో గతంలోలా ఏకపక్ష నిర్ణయాలు ఉండవనేది స్పష్టమవుతోంది.