https://oktelugu.com/

Naveen Polishetty: విజయ్ దేవరకొండ ప్లేస్ లో నవీన్ పోలిశెట్టి

Naveen Polishetty: సినిమా పరిశ్రమలో హీరోగా ఎదగడం, హీరోగా ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని కెరీర్ ను కొనసాగించడం మాటలు కాదు. కానీ ఎవరి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో దూసుకుపోతున్న యంగ్ హీరోలు ఉన్నారు. ఎవరి వెనుదన్ను లేకుండానే సినిమా పరిశ్రమకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి, అవకాశాల కోసం తిరుగుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొని మెల్లమెల్లగా హీరోలుగా మారి సక్సెస్ లు అందుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) & నవీన్ పోలిశెట్టి (Naveen […]

Written By: , Updated On : September 15, 2021 / 06:06 PM IST
Follow us on

Naveen Polishetty In Vijay Devarakonda Place In Koratala Movie

Naveen Polishetty: సినిమా పరిశ్రమలో హీరోగా ఎదగడం, హీరోగా ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని కెరీర్ ను కొనసాగించడం మాటలు కాదు. కానీ ఎవరి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో దూసుకుపోతున్న యంగ్ హీరోలు ఉన్నారు. ఎవరి వెనుదన్ను లేకుండానే సినిమా పరిశ్రమకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి, అవకాశాల కోసం తిరుగుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొని మెల్లమెల్లగా హీరోలుగా మారి సక్సెస్ లు అందుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) & నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty).

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాల గోల్డ్ ఫేస్ లో ఉండేవాళ్ళలా కనిపించినా వీరిద్దరికి ఎన్నో కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయి. నిజానికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో వీరిని చూసినప్పుడు మనం గుర్తించం కూడా. కానీ ఇప్పుడు ఈ హీరోలు ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. అయితే, వీరిద్దరిలో విజయ్ దేవరకొండ రేంజ్ మరో లెవల్.

అర్జున్ రెడ్డి తో ఏకంగా స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం లైగర్ అంటూ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక నవీన్ సంగతికి వస్తే.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ల చూపు అంతా ఈ యంగ్ హీరో మీదే ఉంది. నవీన్ నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎంతటి వైవిధ్యమైన సినిమానో తెలిసిందే.

పైగా ఆ సినిమా బారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ‘జాతి రత్నాలు’ అంటూ నవీన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ నిర్మాతగా వస్తోన్న మొదటి సినిమాలో హీరో నవీనే.

అలాగే కొరటాల శివ నిర్మాణంలో రానున్న సినిమాలో కూడా హీరోగా నవెన్ పోలిశెట్టినే అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరోగా మొదట విజయ్ దేవరకొండను అనుకున్నాడు కొరటాల. కానీ, విజయ్ తో సినిమా లేట్ అవుతుంది అని నవీన్ కి ఫిక్స్ అయ్యాడట. మొత్తానికి విజయ్ దేవరకొండకి నవీన్ పోటీ అయిపోయాడు.