Homeజాతీయ వార్తలుఇంట ఓడి రచ్చ గెలిచిన రేవంత్

ఇంట ఓడి రచ్చ గెలిచిన రేవంత్

TPCC Revanth Reddyరేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మల్కాజిగిరి నుంచే ప్రారంభం అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ లో ఉత్సాహం ఉరకలేసింది. తరువాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్,బీజేపీ తమకు ప్రత్యామ్నాయం కాదని టీఆర్ఎష్ 16 సీట్లు గెలుస్తుందని దీమా వ్యక్తం చేసింది. కారు సారు పదహారు అనే నినాదంతో టీఆర్ఎస్ ప్రచారం సాగించింది.

మల్కాజిగిరి దేశంలోనే పెద్ద నియోజకవర్గం. 27 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలతో ఏర్పాటు చేసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ విజయం సాధించారు.

బీజేపీ, టీఆర్ఎస్ కు దీటుగా ప్రశ్నించే గొంతు ఉండాలనే నినాదంతో పోటీలో నిలిచారు. మల్కాజిగిరిలో అక్షరాస్యలు ఎక్కువగా ఉండడంతో అందరూ ఏకతాటిపైకి వచ్చి రేవంత్ రెడ్డిని విజయానికి పాటుపడ్డారు. రేవంత్ నిర్వహించిన బహిరంగ సభ, రోడ్ షోల్లో యువతే ప్రముఖ పాత్ర పోషించారు. టీఆర్ఎస్ సైతం ఓట్లు చీల్చలేకపోయింది. మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.

రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలవడంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లే అవకాశం కలిగింది. జిల్లాలో ఏకైక ప్రతిపక్ష నేతగా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వంపై చేపట్టే నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ప్రభుత్వం చేసే పనులను విమర్శించారు. టీఆర్ఎస్ కు దీటైన వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. దీంతో ఇప్పటికి కలిసొచ్చి పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం పొందారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version