Telangana Election Results 2023: గాంధీభవన్ లో టీడీపీ జెండాల హవా! ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ‘ హ్యాండ్’ ఇవ్వబోతున్నారా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ విభజిత ఏపీలో ఒక పర్యాయం అధికారంలో కొనసాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన తరువాత టీడీపీ మెల్లమెల్లగా నామరూపాల్లేకుండా పోయింది.

Written By: Chai Muchhata, Updated On : December 3, 2023 2:56 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా సాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ పార్టీ 17 స్థానాల్లో విజయం సాధించింది. మరో 48 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. గత పదేళ్లుగా బోసిపోయిన గాంధీ భవన్ మరోసారి కార్యకర్తల హడావుడితో కళకళలాడుతోంది. అయితే ఆసక్తికర విషయమేంటంటే ఇక్కడ టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. కాంగ్రెస్ జెండాలతో కలిపి పసుపు జెండాలు కనిపించడంతో పొలిటికల్ గా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మరోసారి టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నారా? అని అనుకుంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ విభజిత ఏపీలో ఒక పర్యాయం అధికారంలో కొనసాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన తరువాత టీడీపీ మెల్లమెల్లగా నామరూపాల్లేకుండా పోయింది. అయితే గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్త పెట్టకుని విజయం సాధించిన ఆడపా దడపా ఒకటి, రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈసారి ఎలక్షన్ నోటిఫికేషన్ సమయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు జైళ్లో ఉండడంతో తెలంగాణ లో పోటీ చేయడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి తెలంగాణలో పోటీ చేయకుండా ఉండడమే మంచిదని భావించారు.

అయితే టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఫేవర్ చేయడానికే టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదని సర్వత్రా ఆసక్తి చర్చ సాగింది. కానీ చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనేనని ఆ పార్టీ నాయకులు తెలిపారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే దూరంగా ఉండడమే మంచిదని భావించినట్లు ఆ పార్టీ నాయకులు భావించారు.

కానీ తాజాగా గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు కనిపించడంతో కొందరి వాదన నిజమేనా? అనిపిస్తోందని అంటున్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి కోసమే పోటీ చేయకుండా ఉన్నారని ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది. ఎందుకంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు కనిపించడమేంటి? అని అనుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిస్తే ఏపీలో కూడా పొత్తు పెట్టుకుంటాయా? అని అనుకుంటున్నారు. అయితే ఇటీవల జనసేన అధినేత టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు కడితే పవన్ పరిస్థితి ఏంటిని అంటున్నారు.