https://oktelugu.com/

Revanth Reddy:కేసీఆర్ చర్యలు.. రేవంత్ రెడ్డి నెత్తిన పాలుపోస్తున్నాయా?

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పార్టీని గాడిలో పెట్టే పనిలో పడిపోయారు. ధర్నాలు, ర్యాలీలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో కేసీఆర్ కు తలనొప్పిగా మారుతోంది. కానీ కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు రేవంత్ రెడ్డికి కలిసొచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరు దృష్టి సారించారు. దీంతో పార్టీలు తమ కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రత్యేక వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. హుజురాబాద్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 8, 2021 / 03:23 PM IST
    Follow us on

    Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పార్టీని గాడిలో పెట్టే పనిలో పడిపోయారు. ధర్నాలు, ర్యాలీలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో కేసీఆర్ కు తలనొప్పిగా మారుతోంది. కానీ కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు రేవంత్ రెడ్డికి కలిసొచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరు దృష్టి సారించారు. దీంతో పార్టీలు తమ కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రత్యేక వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి.

    హుజురాబాద్ లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. మొత్తం రాజకీయాలు హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో వెనుకబడిపోయిందని తెలుస్తోంది. కానీ అభ్యర్థి ఎంపికలో ముందంజలో వేయలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ కావాలనే జాప్యం చేస్తోందని తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక దీపావళి తరువాతే ఉంటుందని ప్రచారం సాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైపోయారు. ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి ఓ సవాలుగా మారనుంది. పార్టీ విజయం సాధించకపోయినా గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకోవాలని పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు ఖరారు చేయించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఉప ఎన్నిక ఆలస్యం కావడంతో కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసొస్తుందనే ప్రచారం సాగుతోంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా పండగల సీజన్ కావడంతో టీఆర్ఎస్ ఎన్నిక వాయిదాకే మొగ్గు చూపడంతో అది కాంగ్రెస్ పార్టీకి కూడా ప్లస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఈ విధంగా కూడా మేలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై పార్టీలు ముమ్మర ప్రచారం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.