TPCC Revanth Reddy: తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది ప్రత్యేకమైన శైలి. ఆరోపణలు చేయడంలో ఆయనకు ఆయే సాటి. ఆయనకు మరెవరు లేరు పోటీ. సీఎం కేసీఆర్ పై ఆయన చేసినన్ని ఆరోపణలు ఎవరు చేసి ఉండరు. అంతటి వాగ్దాటితో తన మనసులోని మాటలను చెబుతుంటారు. ఇటీవల ఆయన మరో బాంబు పేల్చారు. అసలు కేసీఆర్ పూర్వీకులు బీహార్ వాసులని చెప్పి మరో మారు ఆయన స్థానికతపై వివాదం రేఆరు. దీంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి కూడా ఆయన ఓ కారణం చెబుతున్నారు. తెలంగాణలో ఐఏఎస్ అధికారులందరు బిహారు వాసులే అని సెలవిచ్చారు. దీంతో ఆయన పూర్వీకుల రాష్ట్రం కావడంతో ఆయన అక్కడి వారినే తమ ప్రభుత్వంలో అధికారులుగా నియమించుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారితో పనులు చేయించుకుంటూ తృప్తి పొందుతున్నారని రేవంత్ రెడ్డి వాదన.
దీనికి బలం చేకూర్చే విధంగానే కేసీఆర్ ప్రవర్తన ఉంటుంది. ఆయన ప్రభుత్వంలో ఐఏఎస్ లందరు బిహార్ వారే కావడం గమనార్హం. దీంతో రేవంత్ రెడ్డి చేస్తున్న వాదంలో కూడా వాస్తవముందనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. కేసీఆర్ కు తెలంగాణకు చెందిన అధికారులు పనికి రారా? వారితో పని చేయించుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఎన్నోమార్లు కేసీఆర్ స్థానికతపై బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే.
Also Read: తెలంగాణలో రైతులను ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల మధ్య వైరం పెంచే వ్యాఖ్యలు చేస్తున్నారనే తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అధికారుల్లో సైతం అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఎందరో అధికారులుండగా పరాయి రాష్ట్రం వారినే ఎందుకు ఎంచుకుంటున్నారని సంశయం వస్తోంది.
దీంతో ఐఏఎస్ అధికారుల్లో కూడా అంతర్మథనం మొదలైంది. తమ సేవల్లో ఏం లోపం ఉందని పరాయి రాష్ట్రం వారికి ఉద్యోగాలు కట్టబెడుతున్నారనే అనుమానాలు వస్తున్నాయి. సొంత రాష్ట్రంలో పనిచేస్తే వెసులుబాటు ఉంటుందని తెలిసినా వారిని లెక్కలోకి తీసుకోకపోవడంతో మన వారు పక్క రాష్ట్రాల మీద ఆధారపడక తప్పడం లేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి కదిపిన తేనెతుట్టె ఎందరిని గాయాలు పాలు చేస్తుందో చూడాలి మరి.
Also Read: పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎగబడుతున్న జనాలు.. నిముషానికి 1000 క్లియర్