Mohan Babu vs Nayi Brahmins: నాయీ బ్రాహ్మణులతో పెట్టుకున్న మోహన్ బాబు.. ఈసారి ఏమవుతుందో ?

Mohan Babu vs Nayi Brahmins: మోహన్ బాబు దగ్గర పది సంవత్సరాల నుండి మేకప్ మెన్‌గా పనిచేస్తున్నాడు శ్రీనివాస్‌. ఇతను నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన వాడు. అయితే శ్రీనివాస్ పై మోహన్ బాబు వృద్ధ సింహంలా గర్జించారు. ఎందుకు గొడవ అని అడిగినందుకు శ్రీనివాస్ పై మోహన్ బాబు బూతులతో విరుచుకు పడ్డారు. ఎక్కువ చేస్తే చీరేస్తా అంటూ రెచ్చిపోయారు. మధ్యలో శ్రీనివాస్ నోరు తెరిచి ఇలా అయితే నేను పని మానేస్తాను అంటూ […]

Written By: Shiva, Updated On : March 2, 2022 6:14 pm
Follow us on

Mohan Babu vs Nayi Brahmins: మోహన్ బాబు దగ్గర పది సంవత్సరాల నుండి మేకప్ మెన్‌గా పనిచేస్తున్నాడు శ్రీనివాస్‌. ఇతను నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన వాడు. అయితే శ్రీనివాస్ పై మోహన్ బాబు వృద్ధ సింహంలా గర్జించారు. ఎందుకు గొడవ అని అడిగినందుకు శ్రీనివాస్ పై మోహన్ బాబు బూతులతో విరుచుకు పడ్డారు. ఎక్కువ చేస్తే చీరేస్తా అంటూ రెచ్చిపోయారు. మధ్యలో శ్రీనివాస్ నోరు తెరిచి ఇలా అయితే నేను పని మానేస్తాను అంటూ చెప్పబోతుంటే. మోహన్ బాబు సీరియస్ అవుతూ.. అతని కులాన్ని కించపరుస్తూ బూతులు తిట్టాడు.

Mohan Babu vs Nayi Brahmins

దాంతో శ్రీనివాస్ ఉద్యోగం మానేశాడు. అతను జాబ్ మానేశాడు అని కక్షగట్టి ఎలాంటి నేర నిరూపణ చేయకుండా శ్రీనివాస్ మీద పోలీస్ స్టేషన్లో రూ.5 లక్షల సామగ్రి దొంగిలించాడని కేసు పెట్టారు మోహన్ బాబు టీమ్. ఇక చేసేది ఏమి లేక, శ్రీనివాస్ బయటకు వచ్చి.. జరిగింది మొత్తం వివరించాడు. తమ కులాన్ని తిట్టిన సంగతి కూడా అతను చెప్పాడు. ఇది నాయీ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నదని వెంటనే మోహన్ బాబు మంగలి సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆ కులానికి చెందిన నాయకులు హెచ్చరించారు.

పైగా నాయీ బ్రాహ్మణ కులం నాయకులు ఒక సమావేశం పెట్టి మరీ మోహన్ బాబు పై సీరియస్ అయ్యారు. కాగా ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలచందర్, రాష్ట్ర క్షౌర వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేశం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అన్నం దాసు చంద్రశేఖర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు మామిడాల రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: భీమ్లానాయ‌క్ లో పిచ్చెక్కిస్తున్న త్రివిక్ర‌మ్ డైలాగులు ఇవే.. ఎన్నాళ్ల‌కు గురూజీ..!

నాయీ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసిన మోహన్ బాబు నాయీ బ్రాహ్మణ సమాజానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలక్రిష్ణ డిమాండ్ చేశారు. అయినా మోహన్ బాబుకు బూతులు తిట్టడం బాగా అలవాటే.

‘మోహన్ బాబు గారు నన్ను అమ్మ నా బూతులు తిట్టారు’ అని గతంలో మా ఎన్నికల్లో బెనర్జీ బాధను కంట్రోల్ చేసుకుంటూ.. ‘నేను ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, అలాంటిది నన్ను అందరి ముందు మోహన్‌ బాబు బూతులు తిడుతూ అవమానించారు అంటూ బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read: తోకలు వద్దయ్యా బాబు.. బాలయ్య కేకలు !

Tags