https://oktelugu.com/

Congress: వరి పోరు.. మారుతున్న కాంగ్రెస్ తీరు

Congress: తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు విషయంపైనే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రవేశిస్తోంది. కల్లాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకుంటోంది. అధికార పార్టీ ఆగడాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఇందుకోసమే ప్రత్యక్ష పోరాటానికి దిగుతోంది. రాష్ర్టవ్యాప్తంగా రైతుల దుస్థితిపై పోరాడేందుకు సిద్ధమైంది. దీనికి గాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన సంగతి […]

Written By:
  • Srinivas
  • , Updated On : November 20, 2021 / 05:22 PM IST
    Follow us on

    Congress: తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు విషయంపైనే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రవేశిస్తోంది. కల్లాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకుంటోంది. అధికార పార్టీ ఆగడాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఇందుకోసమే ప్రత్యక్ష పోరాటానికి దిగుతోంది. రాష్ర్టవ్యాప్తంగా రైతుల దుస్థితిపై పోరాడేందుకు సిద్ధమైంది. దీనికి గాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

    ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ నేతలు రాళ్లు రువ్వి దాడులకు తెగబడిన విషయం విధితమే. దీంతో రెండు పార్టీల్లో మాటల యుద్ధం పెరుగుతోంది. ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ తప్పు మీదంటే మీదని విమర్శలకు దిగుతున్నారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ బీజేపీపై విమర్శలకు దిగడం గమనార్హం.

    ధాన్యం కొనుగోలు ఎలాంటి అవరోధాలు లేవని బీజేపీ నేతలు చెబుతుంటే కేంద్రమే ధాన్యం కొనొద్దని చెబుతోందని టీఆర్ఎస్ బుకాయిస్తోంది. దీంతో ఇరు పార్టీల నేతలు రైతుల సమస్యలు పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలును రాజకీయం చేయకుండా కొనుళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

    Also Read: Repeal of Agricultural Laws: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఇంత స్టోరీ ఉందా..?

    ఎక్కడ లేని ఇబ్బందులు రాష్ర్టంలో ఎందుకు వస్తున్నాయని బీజేపీ నేతలు అధికార పార్టీ టీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. దేశంలో ఏ రాష్ర్టంలో లేని సమస్య ఇక్కడ ఎందుకు ప్రారంభమైందో టీఆర్ఎస్ నేతలే చెప్పాలని చెబుతున్నారు. రైతుల ఇబ్బందులు తొలగించి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వారి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. దీని కోసం రాష్ర్ట ప్రభుత్వం నిజాలు తెలుసుకోవాలని సూచిస్తోంది.

    Also Read: Balakrishna: చంద్రబాబు కోసం కదిలిన నందమూరి కుటుంబం, బాలయ్య

    Tags