ఆంధ్రప్రదేశ్ లో తిట్ట పురాణం నడుస్తోంది. అందరు పుణ్యం కోసం పురాణాలు చదివితే ఇక్కడ మాత్రం తిట్లే వారికి దండకంగా మారుతున్నాయి. ఎదుటి వారిని ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా అసభ్యతకు పెద్దపీట వేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా జుగుస్సాకరంగా మాట్లాడుతూ వారిలో కూడా రాక్షసత్వం దాగి ఉందని నిరూపిస్తున్నారు. ఎదుటి వారిపై ఎంత పడితే అంత మాటలు అంటూ వారిని నైతికంగా దెబ్బ తీస్తున్నారు. బూతులే వారికి నీతులుగా కనిపిస్తున్నాయి.

ఇందులోకి ఆడవారిని సైతం లాగుతూ వారి మనోబలాన్ని కించపరుస్తున్నారు. ఇంత దారుణమైన మాటలు ఎవరో సభ్యత తెలియని వారన్నారంటే కాదు అన్ని తెలిసిన వారే అనడం కొసమెరుపు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే కంట తడి పెట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వయసులో పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టారీతిగా విమర్శలు చేయడంతో ఆయన కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై ఇతర పార్టీల నేతలు సైతం తప్పుపడుతున్నారు.
అధికార పార్టీ నేతల తీరుతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. హుందాగా వ్యవహరించాల్సిన రాజకీయాలను భ్రష్టుపట్టిస్తూ చులకన అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్టీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలతో రాజకీయ దుమారం రేగుతోంది. వ్యక్తిగత విమర్శలకు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతూ వైరల్ చేస్తున్నారు.
Also Read: Narendra Modi: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయడం ఇది ఎన్నో సారి ?
రాష్ర్టంలో నెలకొన్న పరిణామాలతో అందరు నివ్వెరపోతున్నారు. మాటల తూటాలు గురి తప్పుతున్నాయి. నేతల విమర్శలతో ప్రజలు సైతం అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా దిగజారిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయనే ఆలోచన వస్తోంది. తమ స్థాయి నీచంగా మారుతున్నా పట్టించుకోవడం లేదు. విమర్శలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ర్ట దుస్థితికి ఎవరు బాధ్యులనే దానిపై కూడా అందరిలో సంశయాలు వస్తున్నాయి. ఒకరిపై మరొకరు పలు విధాలుగా విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను మాత్రం భ్రష్టు పట్టిస్తున్నారనే విషయం తెలిసిపోతోంది.
Also Read: Balakrishna: చంద్రబాబు కోసం కదిలిన నందమూరి కుటుంబం, బాలయ్య