CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం దావోస్ వెళ్లారు. రెండు రోజుల క్రితం దావోస్ వేదికగా అంతర్జాతీయ ఎకనామిక్ ఫోరం సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులతో కలిసి రెండు రోజుల్లో 60 మంది అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.
పెట్టుబడులే లక్ష్యంగా..
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన కొనసగుతోంది. అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిసిన రేవంత్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తుతన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంవట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మేకొనెన్‌తోపాటు పలువురు పారిశ్రామికవేత్తలతో రేవంత్‌రెడ్డి సమావేశమై పెట్టుబడుల గురించి చర్చించారు.
హెల్త్ సెక్టార్‌లో రేవంత్ ప్రసంగం..
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా జనవరి 17న హెల్త్ సెక్టార్‌లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అంశంపై సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌ను కలిసేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. నోవర్తీస్, మడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక్, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, యూపీఎల్ వంటి అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఛానెళ్లకు ఇంటర్వ్యూ..
ఒకవైపు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్న రేవంత్.. మరోవైపు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అక్కడి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దావోస్‌లో జరిగిన సమావేశాలు, చర్చలు, ఒప్పందం వివరాల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ట్రోల్ చేస్తున్న బీఆర్‌ఎస్..
ఇదిలా ఉండగా, రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనను బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్ ట్రోల్ చేస్తోంది. రేవంత్ వీడియోలను ఎడిటింగ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. రేవంత్‌రెడ్డి అక్కడి మీడియా అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వడం లేదని, సమావేశాల్లోనూ ఏం మాట్లాడాలో తెలియడం లేదని వ్యంగంగా కామెంట్ చేస్తున్నారు. ఓ బీఆర్‌ఎస్ నేత అయితే.. కృష్ణభగవాన్ ఓసినిమాలోని సన్నివేశాన్ని దావోస్‌లో రేవంత్ పర్యటనతో పోలుస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఇక ఇంటర్వ్యూ, ప్రెస్‌తో మాట్లాడిన మాటలనూ బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
తిప్పకొట్టలేకపోతున్న కాంగ్రెస్..
మాజీ మంత్రి కేటీఆర్‌ను హైలైట్ చేసేందుకు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్.. రేవంత్ దావసోస్ పర్యటనను ట్రోల్ చేస్తోంది. కానీ ఆ ట్రోల్స్‌ను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ విఫలమవుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌తో పోల్చుకుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా కాస్త వెనుకబడే ఉంది. ఇదే అదునుగా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్ సీఎం రేవంత్‌పై ఇష్టానుసారం ట్రఃల్ చేస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.