Revanth Reddy Hunts KCR: ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆదివారం నిర్వహించిన మన ఊరు మన పోరు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన రేవంత్.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యపు గింజ కొనుగోలు చేసే వరకు పోరాడుతామన్నారు. ధాన్యం కొనేందుకు ఏప్పిల్ నుంచే సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేయకుంటే ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
నిజామాబాద్ లోని చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తామని కవిత మాట ఇచ్చింది. ఎంపీగా గెలిచాక ఆ హామీని మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు హామీ ఇచ్చి ప్రస్తుతం ఎంపీ.. దానిని విస్మరించారని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్లు కాగా.. అందులోంచి రూ.10 వేల కోట్లు పెట్ట ధాన్యం కొనుగోలు చేయలేరా అని ప్రశ్నించారు. కానీ కారణాన్ని మాత్రం కేంద్రంపై నెట్టేస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఢిల్లీలో అగ్గిపుట్టిస్తానని కేసీఆర్ బయలుదేరుతున్నాడని విమర్శించారు.
Also Read: AP TDP Mistake: టీడీపీని వెంటాడుతున్న ఆ పెద్ద లోపం.. ఇలా అయితే కష్టమే..!
సీఎం ఫౌంహౌస్‌లో పండించిన ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారో.. అన్నదాతలు పండించిన ధాన్యాన్ని సైతం అలాగే కొనాలని డిమాండ్ చేశారు. లేదంటే దొడ్డు కర్రలు పట్టుకున్న సైన్యంతో వెంటాడతామని హెచ్చరించారు. అవసరమైనన్ని గన్నీ సంచులు అందుబాటులో ఉంచి ఐకేపీ కేంద్రాలు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే లక్షల మంది సైన్యంతో ఫామ్ హౌస్ గోడలను బద్దలు కొడతామని హెచ్చరించారు. సురేందర్ ను 35 వేల మెజారిటీతో గెలిపిస్తే ఆయన టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడపోయాడని ఆరోపించారు.
ఎమ్మెల్యే సొంత ఊరిలో అన్నదాత ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించేందుకు టైం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎల్లారెడ్డిలో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. గెలుపు ఓటములు సహజమన్నారు. వరి కొనుగోలు చేయడం చేతకాకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ కొత్తగా నాటకం మొదటపెట్టబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ కోసం చాలా మంది కష్టపడుతున్నారని, అలాంటి వారికి పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Chiranjeevi- Nani: ‘డాడీ’ గా మెగాస్టార్.. ‘బ్రో’ గా నాని.. కలయిక అదిరిపోయింది !
Recommended Video:
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Revanth reddy hunts kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com