Revanth Reddy: తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి మాటల తూటాలు పేల్చగల నేత ఎవరంటే ఖచ్చితంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు చెబుతారు. అందరూ కేసీఆర్ జాతీయ పార్టీ ‘బీఆర్ఎస్’పై ప్రశంసలు కురిపిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం సెటైర్లతో విరుచుకుపడ్డారు. తాజాగా కేసీఆర్ తో తెలంగాణకు రుణం తీరిపోయిందని.. సంచలన కామెంట్స్ చేశారు.

కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో.. ఆర్థికంగా బలోపేతమయ్యారని.. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంది.. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారు. తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని ఆయన గ్రహించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కు రుణం తీరిపోయిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని.. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆరెఎస్ మాట ఎత్తుకున్నాడని అన్నారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమన్నారు. తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని..తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని విమర్శించారు.
ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా.. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట.. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్ కు అర్హత లేదు..తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలి.. ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆరెఎస్ .. ఆ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోండని తెలిపారు.
దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టండని.. నేను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకుంటా తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను మేమే పరిష్కరించుకుంటామని.. ఇక తెలంగాణతో కేసీఆర్ కు రుణం తీరిపోయిందని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
[…] Also Read: Revanth Reddy: కేసీఆర్ బీఆర్ఎస్ పై అదిరిపోయే ప… […]
[…] Also Read: Revanth Reddy: కేసీఆర్ బీఆర్ఎస్ పై అదిరిపోయే ప… […]