https://oktelugu.com/

సీనియర్లు రాకున్నా.. సత్తా చాటిన రేవంత్‌

తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపుల కొట్లాటలు అందరికీ తెలిసిందే. ఇప్పటికే పార్టీలో ఎవరికి వారుగా అన్నట్లే వేరు కుంపట్లు పెట్టారు. సీనియర్లంతా ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో అడ్డా వేశారు. ఇప్పుడు ఈ పోరు కాస్త పతాక స్థాయికి చేరుకుంది. రేవంత్‌ రెడ్డి రైతు రణభేరీ సభను భారీగా నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా తాము పీసీసీ రేసులో ఉన్నామని చెప్పుకుంటున్న వారెవరూ.. ఈ సభకు హాజరు కాలేదు. కానీ.. క్యాడర్‌‌ను మాత్రం పెద్ద ఎత్తున సమీకరించారు. భారీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 17, 2021 / 03:42 PM IST
    Follow us on


    తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపుల కొట్లాటలు అందరికీ తెలిసిందే. ఇప్పటికే పార్టీలో ఎవరికి వారుగా అన్నట్లే వేరు కుంపట్లు పెట్టారు. సీనియర్లంతా ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో అడ్డా వేశారు. ఇప్పుడు ఈ పోరు కాస్త పతాక స్థాయికి చేరుకుంది. రేవంత్‌ రెడ్డి రైతు రణభేరీ సభను భారీగా నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా తాము పీసీసీ రేసులో ఉన్నామని చెప్పుకుంటున్న వారెవరూ.. ఈ సభకు హాజరు కాలేదు. కానీ.. క్యాడర్‌‌ను మాత్రం పెద్ద ఎత్తున సమీకరించారు. భారీ హంగామా చేశారు. సభలో రేవంత్‌ కూడా అంతే దూకుడుగా వ్యవహరించారు. రైతు ఎజెండాతో పాటు.. పార్టీలోని తన వ్యతిరేకులను.. తన పాదయాత్రను వ్యతిరేకించిన వారిని టార్గెట్ చేశారు.

    Also Read: మూడు రోజులుగా హస్తినలోనే..! : వారు సాధిస్తారంటారా..?

    అయితే.. నేరుగా ఎవరినీ విమర్శించకున్నా కాంగ్రెస్‌ సీనియర్‌‌ లీడర్లపై విరుచుకుపడినట్లుగా మాత్రం అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని బతికించే వారు కావాలని.. అది రేవంత్‌ రెడ్డికే సాధ్యమవుతుందంటూ వ్యాఖ్యలు సంధించారు. ఈ సభలో రేవంత్ అనుకూలురు ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ కట్టబెట్టేందుకు ప్రయత్నించారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఇలానే చాలా మంది సీనియర్లు అడ్డుకున్నారని.. ఇప్పుడు కూడా అలాంటి వారు ఉన్నారని మండిపడ్డారు. అదే సమయంలో వైఎస్‌కు అత్యంత సన్నిహితుడయిన.. సూరీడు కూడా రావిరాల సభా వేదిక మీద కనిపించారు. ఇతర నేతలంతా రేవంత్‌కు వైఎస్ తరహా ఇమేజ్ కట్టబెట్టే ప్రయత్నం చేయడం.. సూరీడు కూడా వేదిక మీద కనిపించడం ఆసక్తి రేపింది.

    మొత్తంగా ఈ సభ కాంగ్రెస్‌లో రేవంత్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలను మాత్రం తెరమీదకు తెచ్చింది. రేవంత్‌కు అనుకూలంగా ఉన్న వారిలో పొన్నం, కుసుమ కుమార్, కొండా సురేఖ, మల్లు రవి, సీతక్క, మల్‌రెడ్డి రంగారెడ్డి, దాసోజు శ్రవణ్, సురేష్ షెట్కర్ వంటి వారు ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిగం ఠాగూర్ వస్తారనుకున్నా ఆయన సీనియర్ల ఒత్తిడికి తలొగ్గారు. రేవంత్‌ను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న ఉత్తమ్, భట్టి, జగ్గారెడ్డి, పొన్నాల, వీహెచ్ వంటి వారు అటెండ్‌ కాలేదు. అయితే.. రేవంత్ తన బలప్రదర్శన మాత్రం చూపారు. అదే టైమ్‌లో తన భవిష్యత్‌ కార్యాచరణను సైతం ప్రకటించారు.

    Also Read: బాబు వెయ్యి చెబితే.. నేను 250 చెబుతా..: పంచాయతీ పోరులో పార్టీల లెక్కలు

    అంతేకాదు.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని రేవంత్‌ ప్రకటించారు. అదే సమయంలో.. హైకమాండ్‌ను ధిక్కరించినట్లుగా కాకుండా.. వారి పర్మిషన్ తీసుకుంటానని కూడా ప్రకటించారు. పాదయాత్ర చేసి కేసీఆర్‌ను కప్పేస్తానని ధీమాను కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి పాదయాత్ర చేసి.. భారీ బహిరంగసభ నిర్వహించి రేవంత్ తన బలాన్ని.. బలగాన్ని పార్టీ హైకమాండ్‌కు చూపించారనేది స్పష్టం. ఇప్పుడు.. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఆయన ఫ్రంట్ రన్నర్‌గానే కనిపిస్తూ ఉండొచ్చు. అయితే.. కాంగ్రెస్‌ రాజకీయాలు అంత ఈజీగా అర్థం కావు కదా. హైకమాండ్‌ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయమే.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్