Revanth Reddy: రాజకీయాల్లో ప్రతి పార్టీ కూడా కొన్ని నినాదాలను ఇస్తుంది. తమ ఉనికిని పెంచుకోవడానికి లేదంటే ప్రజల్లోకి బలంగా తమ నినాదం వెళ్తే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే తపన కూడా ఉంటుంది. ఇలాంటి నినాదాలు ఎన్నికలకు ముందు జగన్ ఎన్నో ఇచ్చాడు. అందులో రావాలి జగన్, కావాలి జగన్‌తో పాటు బైబై బాబు కూడా ఒకటి. ఇది అప్పట్లో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. చివరకు చంద్రబాబుకు అధికారం దూరం అయింది.

అయితే ఒకరికి పని చేసిన నినాదాలు ఇంకొకరికి పనిచేస్తాయని కాదు. అలాగని చేయవని కాదు. ఒక చోట సక్సెస్ అయిన ఫార్ములాను ఇంకో చోట వాడటం సహజమే. అది సినిమాల్లో అయినా, లేదంటే రాజకీయాల్లో అయినా. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్ ఫార్ములాను వాడేస్తున్నారు. నిన్న జనగామలో కేసీఆర్ ప్రసంగంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Also Read: జీవిత భాగస్వామితో జీవితాంతం సంతోషంగా ఉండాలా.. చెప్పకూడని అబద్ధాలు ఇవే!
తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన మోడీ మీద కేసీఆర్ ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నాడని రేవంత్ రాసుకొచ్చారు. కేసీఆర్‌కు భయం పట్టుకుందని, అందుకే సూటిగా అడగలేకపోతున్నాడని మండిపడ్డాడు. ఈ సందర్భంగా బైబై కేసీఆర్ అనే హాశ్ ట్యాగ్‌ను జత చేశారు. అంటే కేసీఆర్‌లో వణుకు మొదలైందని, ఇక ఆయన ఓటమి ఖాయం అన్నట్టు రేవంత్ చెబుతున్నారన్నమాట.

అయితే ఆంధ్రాలో వర్కౌట్ అయిన ఈ నినాదం తెలంగాణలో వర్కౌట్ అవుతుందా అంటే చెప్పలేం. ఏపీలో జగన్ ఒక్కడే ప్రతిపక్షంగా ఉన్నారు. కానీ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అంటే త్రిముఖ పోరు. ఒకవేళ ఈ నినాదం పనిచేసినా.. అంతిమంగా కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందా అంటే చెప్పలేం. ఏదో విధంగా తన ఉనికిని చాటుకునే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఇలాంటి నినాదాలు ఎన్నికల సమయంలో అయితే బాగా పేలుతాయి. కానీ సందర్భం లేకుండా వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు కదా.
Also Read: తండ్రీ కొడుకుల పోటీ పడ్డా.. హిట్ కొట్టలేకపోయారు !
[…] Mahira Khan: పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ పై ఓ నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘నువ్వో పాకిస్తానీ బిచ్చగత్తె. ముందు నీ దేశం మీద ఫోకస్ పెట్టు’ అని కామెంట్ చేశాడు. దీనికి మహిరా స్పందిస్తూ.. ‘నువ్వేంటి మరి నా మీద ఫోకస్ చేస్తున్నావ్’ అని కౌంటరిచ్చింది. ఈమె 2017లో రయీస్ సినిమాలో షారుక్ సరసన నటించింది. ఆ తర్వాత భారత్‌లో పాక్ నటులపై నిషేధం విధించడంతో మరే సినిమాలోనూ నటించలేదు. అయినా తనను ఇలా ఇండియాలో టార్గెట్ చేయడం పై ఈ నటి బాగా ఫీల్ అవుతుంది. […]
[…] Instagram: ప్రస్తుతం ఉన్నదంతా సోషల్ మీడియా యుగమే. ఏది చెప్పాలన్నా సరే సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి సోషల్ మీడియా యాప్ లలో ఇన్ స్టా గ్రామ్‌ది సెపరేటు లెవల్. అయితే ఈ ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటి వరకు ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది క్రిస్టియానో రొనాల్డో గురించి. […]