కాంగ్రెస్ సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితులు మారాయి. టీపీసీసీ రేసులో తొలి నుంచి ముందంజలో ఉన్న రేవంత్ ను వెనక్కి లాగేందుకు కొందరు సీనియర్లు పావులు కదుపుతున్నారు.
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అధిష్టానం వద్ద.. మీడియా ముందు గళం విప్పుతున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే తాను పార్టీ నుంచి తప్పుకుంటానని వీహెచ్ హన్మంతరావు బహిరంగంగానే ప్రకటించడం సంచలనంగా మారింది.
ఈక్రమంలోనే రేవంత్ అభిమానులు వీహెచ్ హన్మంతరావుపై విమర్శలు గుప్పించారు. ఈక్రమంలో ఓ వ్యక్తి తాను రేవంత్ అభిమాని అంటూ వీహెచ్ ఫోన్ చేశాడు.
రేవంత్ కు పీసీసీ ఇస్తే మీకున్న అభ్యంతరం ఏంటీ అని ప్రశ్నించాడు. ఈక్రమంలోనే వీహెచ్ ను దుర్భాషలాడటంతో వీహెచ్ సదరు వ్యక్తిపై పోలీసులకు ఈనెల 25న సైబరాబాద్ సీపీ, డీజీపీకి ఫిర్యాదు చేశాడు.
ఈక్రమంలోనే పోలీసులు అతడిని వరంగల్ జిల్లా కాశిబుగ్గకు చెందిన కమల్ గా గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే పీసీసీ రేసులో ఇప్పటికీ కూడా రేవంత్ పేరే ప్రముఖంగా విన్పిస్తుండటం గమనార్హం.