Unemployed in Telangana:13 ఏళ్లు.. 10ఏళ్ల వెసులుబాటు.. నిరుద్యోగుల యాతనకు ఇప్పటికీ ఫలితమా?

Unemployed In Telangana:  తెలంగాణ నిరుద్యోగులది అలుపెరగని కష్టం. వారే లేకుంటే ఇప్పుడు స్వరాష్ట్రం సిద్ధించేది కాదు.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి మధ్యలో డ్రాప్ అయినా కూడా నిరుద్యోగులంతా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాన్ని హోరెత్తించారు. తెలంగాణ కోసం యువకుడు శ్రీకాంతాచారి ఏకంగా ప్రాణత్యాగం కూడా చేశారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించింది. ఇప్పుడు రాష్ట్రం ఆ ఫలాలు అనుభవిస్తోంది. అయితే తెలంగాణ కోసం ఇంతగా కొట్లాడిన యువతకు మాత్రం వారి ఆశలు నెరవేరడానికి […]

Written By: NARESH, Updated On : March 9, 2022 6:31 pm
Follow us on

Unemployed In Telangana:  తెలంగాణ నిరుద్యోగులది అలుపెరగని కష్టం. వారే లేకుంటే ఇప్పుడు స్వరాష్ట్రం సిద్ధించేది కాదు.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి మధ్యలో డ్రాప్ అయినా కూడా నిరుద్యోగులంతా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాన్ని హోరెత్తించారు. తెలంగాణ కోసం యువకుడు శ్రీకాంతాచారి ఏకంగా ప్రాణత్యాగం కూడా చేశారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించింది. ఇప్పుడు రాష్ట్రం ఆ ఫలాలు అనుభవిస్తోంది.

Unemployed in Telangana

అయితే తెలంగాణ కోసం ఇంతగా కొట్లాడిన యువతకు మాత్రం వారి ఆశలు నెరవేరడానికి 10 ఏళ్లకు పైగా పట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నీళ్లు, నిధులు త్వరగానే నెరవేరాయి. కేసీఆర్ గద్దెనెక్కగానే నీళ్లపై పడి ఆ కొరత తీర్చాడు. నిధులు పెంచాడు. కానీ నియామకాలు మాత్రం చేపట్టలేకపోయాడు.

జోన్లు, మల్టీ జోన్లు, నాన్ లోకల్ వివాదాలతో గత ఏడేళ్లుగా తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఎట్టకేలకు రాష్ట్రపతి ఉత్తర్వులతో 95 శాతం కోట స్థానిక యువతకే.. ఆ జిల్లాల వారికే దక్కేలా కేసీఆర్ జోన్లను విభజించారు. దీంతో ఎట్టకేలకు ఆ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ 8 ఏళ్లు అవుతుంది. అంతకుముందు ఉద్యమకాలంలో ఐదేళ్ల పాటు పెద్దగా రిక్రూట్ మెంట్లే చేపట్టలేదు. దాదాపు 13 ఏళ్లు ఉద్యోగాలు లేక యువత కళ్లు కాయలు కాసి పండ్లు పండే వరకూ ఎదురుచూశారు. కేసీఆర్ పై పీకల దాక కోపం పెంచుకున్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన బీజేపీని ఓన్ చేసుకున్నారు.

Also Read: పవన్ కల్యాణ్ యువ క్రికెటర్ కు చేసిన సాయమెంత?

కానీ ఎట్టకేలకు కేసీఆర్ కు ఆ వ్యతిరేకత సెగ తగిలింది. బీజేపీని కంట్రోల్ చేయాలంటే.. దానికి నిరుద్యోగులను దూరం చేయాలంటే ‘ఉద్యోగ నియామకాలు’ ఒక్కటే పరిష్కారం అని భావించారు. అందుకే వ్యూహాత్మకంగా ఇంకో రెండేళ్లు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న వేళ 90 వేల ఉద్యోగాలు ప్రకటించారు. వాటిని ఎన్నికల వరకూ నిర్వహిస్తారు. నిరుద్యోగులను చదువులకు మళ్లిస్తారు. మరోసారి గెలిచేందుకు ఈ స్కెచ్ గీశారు.

నిరుద్యోగుల ఆశలు ఇప్పటికైనా నెరవేరాయి. కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10 ఏళ్ల వెసులబాటు కల్పించారు. 49 ఏళ్ల వరకూ ఉద్యోగాలకు అర్హత కల్పించారు. ఇలా తెలంగాణ నిరుద్యోగులంతా ఇప్పుడు ఇన్నేళ్ల కష్టాన్ని మరిచి జాప్యానికి విసిగి ఎట్టకేలకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా వారి కల నెరవేరినందుకు.. పాలకులు ఉద్యోగాలు కల్పించినందుకు అందరూ సంతోషిస్తున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వీరులకు ఈరోజు ఒక గొప్పదినంగా అభివర్ణిస్తున్నారు.

Also Read: ఉద్యోగాల ప్రకటనపై ప్రతిపక్షాల గోల