Homeఆంధ్రప్రదేశ్‌పెట్టుబడులు పోతున్నా జగన్ పెదవి విప్పరెందుకు?

పెట్టుబడులు పోతున్నా జగన్ పెదవి విప్పరెందుకు?

Andhra Pradeshఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆపడం లేదు. దీంతో తాజాగా తాము పరిశ్రమ పెట్టబోమంటూ ఇచ్చిన భూమిని రిలయన్స్ వెనక్కి ఇచ్చేసింది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ట్రైటస్ అనే అమెరికా సంస్థతో ఎలాంటి సంప్రదింపులు చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది.

దీంతో గొప్ప పారిశ్రామిక అవకాశాన్ని కోల్పోయింది. యువత ఉద్యోగావకాశాలు కోల్పోయింది. ఏఫీ సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో గత ప్రభుత్వంలో ఆసక్తి చూపించిన సంస్థలను పట్టించుకోలేదు.

కంపెనీలతో సంప్రదింపులు జరపకపోవడంతో అవి ముందుకు రాలేదు. వాటికి ప్రోత్సాహకాలు సైతం ఇవ్వలేదు. విశాఖలో అదానీ డేటా సెంటర్, తిరుపతిలో రిలయన్స్ సెజ్ లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా తరలిపోయాయి. రెండేళ్లో ఆంధ్రప్రదేశ్ కు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వాటికి భూములు కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ పోతుందే తప్ప ఇంతవరకు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

దీంతో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఏపీ సర్కారు మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి మాత్రం ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో కనిపించడం లేదు. ఇలా రాజకీయం చేస్తుందే కానీ ప్రజల మేలు కోసం ఏ నిర్ణయం కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. రాష్ర్టానికి, ప్రజలకు అన్యాయమే చేస్తోంది.

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version