పెట్టుబడులు పోతున్నా జగన్ పెదవి విప్పరెందుకు?

ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆపడం లేదు. దీంతో తాజాగా తాము పరిశ్రమ పెట్టబోమంటూ ఇచ్చిన భూమిని రిలయన్స్ వెనక్కి ఇచ్చేసింది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ట్రైటస్ అనే అమెరికా సంస్థతో ఎలాంటి సంప్రదింపులు చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది. దీంతో గొప్ప పారిశ్రామిక అవకాశాన్ని కోల్పోయింది. యువత ఉద్యోగావకాశాలు కోల్పోయింది. ఏఫీ సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల […]

Written By: Srinivas, Updated On : June 26, 2021 5:00 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆపడం లేదు. దీంతో తాజాగా తాము పరిశ్రమ పెట్టబోమంటూ ఇచ్చిన భూమిని రిలయన్స్ వెనక్కి ఇచ్చేసింది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ట్రైటస్ అనే అమెరికా సంస్థతో ఎలాంటి సంప్రదింపులు చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది.

దీంతో గొప్ప పారిశ్రామిక అవకాశాన్ని కోల్పోయింది. యువత ఉద్యోగావకాశాలు కోల్పోయింది. ఏఫీ సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో గత ప్రభుత్వంలో ఆసక్తి చూపించిన సంస్థలను పట్టించుకోలేదు.

కంపెనీలతో సంప్రదింపులు జరపకపోవడంతో అవి ముందుకు రాలేదు. వాటికి ప్రోత్సాహకాలు సైతం ఇవ్వలేదు. విశాఖలో అదానీ డేటా సెంటర్, తిరుపతిలో రిలయన్స్ సెజ్ లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా తరలిపోయాయి. రెండేళ్లో ఆంధ్రప్రదేశ్ కు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వాటికి భూములు కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ పోతుందే తప్ప ఇంతవరకు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

దీంతో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఏపీ సర్కారు మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి మాత్రం ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో కనిపించడం లేదు. ఇలా రాజకీయం చేస్తుందే కానీ ప్రజల మేలు కోసం ఏ నిర్ణయం కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. రాష్ర్టానికి, ప్రజలకు అన్యాయమే చేస్తోంది.