https://oktelugu.com/

రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ గా మారుస్తారా..!

తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏడాదిపాటు పాలన సవ్యంగానే సాగింది. అయితే రెండో ఏడాది పాలనంతా గాడితప్పినట్లు కన్పిస్తోంది. ఎన్నడూలేని విధంగా సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. Also Read: ఓటుకు నోటు కేసులో బుక్కైన చంద్రబాబు.. సుప్రీం గ్రీన్ సిగ్నల్? సచివాలయం కూల్చివేత.. ఎల్ఆర్ఎస్.. ధరణి పోస్టల్లో సంకేతిక సమస్యలు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి.. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ సీట్లు తగ్గడం వంటివి రెండో ఏడాదిలోనే చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ రెండో ఏడాది పాలన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 17, 2020 8:01 pm
    Follow us on

    Jagga-Reddy-Letter-to-KCR
    తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏడాదిపాటు పాలన సవ్యంగానే సాగింది. అయితే రెండో ఏడాది పాలనంతా గాడితప్పినట్లు కన్పిస్తోంది. ఎన్నడూలేని విధంగా సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

    Also Read: ఓటుకు నోటు కేసులో బుక్కైన చంద్రబాబు.. సుప్రీం గ్రీన్ సిగ్నల్?

    సచివాలయం కూల్చివేత.. ఎల్ఆర్ఎస్.. ధరణి పోస్టల్లో సంకేతిక సమస్యలు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి.. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ సీట్లు తగ్గడం వంటివి రెండో ఏడాదిలోనే చోటుచేసుకున్నాయి.

    టీఆర్ఎస్ రెండో ఏడాది పాలన ఇటీవలే పూర్తి చేసుకొని మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే సమస్యలు మాత్రం వీడడం లేదు. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ విజయవంతం కాకపోగా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా కన్పిస్తోంది.

    ధరణి పోర్టల్ లో నిత్యం సాంకేతిక సమస్యలు వస్తుండటంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా స్పందించారు. ధరణితో ప్రజల ఆస్తులకు భద్రత వస్తుందని కేసీఆర్ కు ఎవరు సలహా ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

    Also Read: రైతుల ఆందోళనలపై ‘సుప్రీం’ సంచలన వ్యాఖ్యలు..!

    నిజాం కాలం నుంచే ప్రజల ఆస్తులకు భద్రత ఉందని.. కొత్తగా ధరణితో ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమి లేదన్నారు. ఐదు నెలల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ నిలిచిపోయిందని దీంతో ఈ రంగంపై పని చేస్తున్న వారు ఉపాధి కోల్పోతున్నారని మండిపడ్డారు.

    కరోనా కాలంలో ఆస్తులు అమ్ముకొని లేదా బ్యాంక్ లోన్ తెచ్చుకొని కాలం గడుపుదామని అనుకున్నా కుదరలేని పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ గా మారుస్తూ ఖజనాను దివాళా తీస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్