Homeక్రైమ్‌Reels video accident Delhi: రీల్స్‌ రోగం.. యువకుడిని బలితీసుకుంది.. ఆ తల్లి గుండెకోత తీరేదెలా?

Reels video accident Delhi: రీల్స్‌ రోగం.. యువకుడిని బలితీసుకుంది.. ఆ తల్లి గుండెకోత తీరేదెలా?

Reels video accident Delhi: రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. నివారణకు ప్రభుత్వాలు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నా అతివేగం, నిబంధనలు పాటించకపోవడం కారణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక చినిపోతున్నవారిలో 20 నుంచి 40 ఏళ్లలోపువారే ఎక్కువ. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తల్లికి గుండెకోత మిగిల్చింది. చేతికి వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ తల్లి దుఃఖం ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. 17 ఏళ్ల టీనేజర్‌ స్కార్పియో నడిపుతూ తన సోదరి రీల్స్‌ వీడియో చిత్రీకరణలో మునిగి. ఇంతలో ఘోరం జరిగిపోయింది. 23 ఏళ్ల సాహిల్‌ ధనేశ్రాను ఢీకొట్టాడు. తల్లి ఇన్నా మాకాన్‌ ఒంటరితనంలో మునిగిపోతోంది.

ప్రమాదం వివరాలు
ఫిబ్రవరి 3, 2026 మధ్యాహ్నం 11:57 గంటలకు ద్వారకా సెక్టార్‌–5, లాల్‌ బహదూర్‌ శాస్త్రి కాలేజీ దగ్గర ఘటన జరిగింది. 17 ఏళ్ల మైనర్‌ డ్రైవర్‌ నడిపిన స్కార్పియో సాహిల్‌ బైక్‌పై ఢీకొని, తర్వాత పార్క్‌ చేసిన స్విఫ్ట్‌ డిజైర్‌ టాక్సీపై పడింది.
సాహిల్‌ తలకు తీవ్ర గాయాలు, అంతర్గత రక్తస్రావం, మల్టిపుల్‌ ఫ్రాక్చర్లతో స్పాట్‌లోనే మృతి చెందాడు. టాక్సీ డ్రైవర్‌ కూడా గాయపడ్డాడు. సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన వీడియో అతివేగమే ప్రమాదానికి కారణమని చూపిస్తోంది.

తల్లి ఆవేదన
మధ్యాహ్నం 1:35కి తనకు కాల్‌ వచ్చి ‘బైక్‌ పడిపోయి యువకుడు చనిపోయాడు‘ అని తెలిపారు. స్పాట్‌కు చేరుకున్న తల్లి, బైక్‌ మూడు ముక్కలు, కొడుకు రోడ్డు మీద పడి ఉన్నాడని చూసి కుంగిపోయింది. ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లమని కోరినా అంబులెన్స్‌లో ఇందిరా గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ‘ధనవంతులు సంపన్నంతో రోడ్లపై ఇలా ఆడుకుంటారు, ఇది క్రిమినల్‌ మైండ్‌‘ అంటూ న్యాయం కోరుతోంది.

చట్టపరమైన చర్యలు
స్కార్పియోపై 13 చలాన్లు ఉన్నా రోడ్లపై తిరిగింది. మైనర్‌ డ్రైవర్‌కు బోర్డు పరీక్షల కోసం ఇంటరిం బెయిల్‌ లభించింది. తల్లి ‘రీల్స్‌ కోసం డ్రైవ్‌ చేసి చంపారు, ధనికులు శిక్షలు ఎవ్వరు‘ అని ప్రశ్నిస్తోంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ద్వారకా సౌత్‌ పోలీస్‌ స్టేషన్‌ బాధ్యత వహిస్తోంది.

ఉన్నత చదువులు చదివి..
సాహిల్‌ సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీలో బీబీఏ చివరి సెమిస్టర్‌ చదువుతూ స్పోర్ట్స్‌ మెడల్స్‌ సాధించాడు. మాంచెస్టర్‌లో లగ్జరీ ఫ్యాషన్‌ మాస్టర్స్‌ కోసం బ్రిటన్‌ వెళ్లే రంగంలో ఉన్నాడు. తల్లి ఆర్థిక భారాన్ని తీర్చుకోవడానికి చిన్న పనులు చేస్తూ కలలు కన్నాడు. ‘రీల్స్‌ సరదాకు నా ఏకైక కుమారుడు పోయాడు‘ అని తల్లి విలపిస్తోంది.

చట్టపరమైన సవాళ్లు
జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ 10వ తరగతి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తల్లి ‘క్రిమినల్‌ చర్యకు పిల్లల పరీక్షలు కారణం కాదు‘ అంటూ న్యాయం కోరుతోంది. పోలీసులు ఇఇఖీV, వీడియోలతో విచారణ జరుపుతున్నారు.
సామాజిక మాధ్యమాల ఆకర్షణలో రిక్లెస్‌ డ్రైవింగ్‌ పెరుగుతోంది. లైసెన్స్‌ చెక్, కఠిన శిక్షలు, భద్రతా చర్యలు తప్పనిసరి.

అలాంటి ప్రమాదాల్లో ధనిక మైనర్లకు సడలింపులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 2016 ఢిల్లీ మెర్సిడెస్‌ ప్రమాదం (సిద్ధార్థ్‌ శర్మ), పూణే ఐఖీ యువకుడు చైతన్య (2024) హిట్‌–అండ్‌–రన్‌లు స్మరణీయం. రోడ్డు భద్రతకు లైసెన్స్‌ చెక్, కఠిన శిక్షలు, అత్యవసర సేవలు మెరుగుపరచాలి. సామాన్యుల బాధలు పరిగణనలోకి తీసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular