https://oktelugu.com/

ఆన్ లైన్ క్లాసుల ఫీజుల విషయంలో హైకోర్టు సంచలన నిర్ణయం

అసలే కరోనా కల్లోలం.. అందరికీ ఉద్యోగ, ఉపాధి కోల్పోయి నానా యాతన పడుతున్నారు.  ఈ విపత్తు వేళ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే ఆన్ లైన్ క్లాసులతోనే కాలం గడుపుతున్నాయి. ఈ ఆన్ లైన్ క్లాసులతో కూడా ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఆ ఫీజు, ఈ ఫీజు అంటూ.. ట్యాబ్ తీసుకోవాలంటూ వేల ఫీజులు గుంజుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలే ఆదాయం లేక తల్లిదండ్రులు అతలాకుతలం అవుతుంటే ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం దోచుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2021 / 09:48 PM IST
    Follow us on

    అసలే కరోనా కల్లోలం.. అందరికీ ఉద్యోగ, ఉపాధి కోల్పోయి నానా యాతన పడుతున్నారు.  ఈ విపత్తు వేళ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే ఆన్ లైన్ క్లాసులతోనే కాలం గడుపుతున్నాయి. ఈ ఆన్ లైన్ క్లాసులతో కూడా ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఆ ఫీజు, ఈ ఫీజు అంటూ.. ట్యాబ్ తీసుకోవాలంటూ వేల ఫీజులు గుంజుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలే ఆదాయం లేక తల్లిదండ్రులు అతలాకుతలం అవుతుంటే ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం దోచుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

    ఈ క్రమంలోనే కరోనా విపత్తు వేళ బేగంపేట, రామాంతాపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఫీజులు చెల్లించలేదని 219 మంది విద్యార్థులకు 17 రోజులుగా ఆన్ లైన్ తరగతులు బోధించడం లేదని పిటీషనర్లు వాదించారు.ఈ విద్యాసంవత్సరం 10శాతం ఫీజు పెంచారని.. ఫీజులు చెల్లించలేదనరి ఆన్ లైన్ తరగతులు ఆపేశారని విన్నవించారు.

    ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా విపత్తు వేళ ఫీజుల విషయంలో విద్యాసంస్థలు మానవీయంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. ఫీజులు కట్టకపోతే ఆన్ లైన్ తరగతులు ఆపేస్తారా? అని హైకోర్టు ప్రశ్నించింది.  ఆ చర్య పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని వ్యాఖ్యానించింది.  ఫీజులతో ముడిపెట్టకుండా విద్యార్థులందరికీ ఆన్ లైన్ బోధన కొనసాగించాలని..తొలగించిన వారికి వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.

    లాభాపేక్ష లేకుండా సొసైటీలు పనిచేయాలని.. కార్పొరేట్ సంస్థల్లా వ్యవహరించవద్దని హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 13కు వాయిదా వేసింది.