Heavy Rains: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జులై నెలలో భారీ వర్షాలు కురవడం ఇదే తొలిసారి. గత పదేళ్లలో ఇంతటి వర్షం పడటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 61 సెంటిమీటర్ల వర్షపాతం పడే వీలుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. ముఖ్యమైన సమావేశాలు రద్దు చేసుకుంది. పరీక్షలు కూడా వాయిదా వేసింది.

ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా మేఘాలు వేగంగా కదువుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 35 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాగల రెండు రోజుల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీని ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశముందని తెలుస్తోంది.
Also Read: Y S Jagan: జగన్కు ఆ ధైర్యం ఉందా.. కేసీఆర్తో ‘ముందు’కొస్తాడా?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జులై నెలలో అత్యంత భారీ వర్షం పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 344 ప్రాంతాల్లో సెంటిమీటర్ నుంచి పది సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. జులై నెలలో ఇంత భారీ వర్షం పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాగల రెండు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని సూచించింది

రాష్ట్రంలోని జలాశయాలు నిండాయి. చెరువులు, కుంటలు పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి నష్టం సంభవించొద్దని సూచించారు. నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం వారి సమస్యలు తీర్చాలని చెప్పారు. దీంతో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలకు ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందించి సాయం చేయాల్సిందిగా కోరారు.
Also Read:Anchor Vishnu Priya: బ్రా మాత్రమే ధరించి రెచ్చిపోయిన తెలుగు యాంకర్.. ఇది అందాల అరాచకం