Director SS Rajamouli: యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నేషనల్ డైరెక్టర్ రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలిచింది. ఈ ఇంటర్వెల్ ప్రభాస్ రేంజ్ ను మరింతగా పెంచింది. రాజమౌళికి రెండింతలు పేరు తీసుకొచ్చింది. కానీ.. అసలు బాహుబలి ఇంటర్వెల్ అది కాదు అట. రాజమౌళి ముందు వేరేలా తీయాలని ప్లాన్ చేశాడట.

ప్రస్తుతం రాజమౌళి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడున్న సినిమాలో అయితే, బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. కానీ, ముందు వేరే సన్నివేశం వద్ద ఇంటర్వెల్ వేయాలని జక్కన్న ప్లాన్ చేశాడు. ఇంతకీ అది ఏమిటో తెలుసా ? “మాహిష్మతి ఊపిరి పీల్చుకో. నా కొడుకు వచ్చాడు.
Also Read: Ram Pothineni: హీరో రామ్ కన్నీళ్లకు కారణమేంటి ?
బాహుబలి తిరిగొచ్చాడు’ అని దేవసేన డైలాగ్ చెప్పగానే శివుడు నడుచుకుంటూ వస్తాడు. అప్పుడు శివుడిలో నుంచి బాహుబలి
ఫిగర్ రావడం పై ఇంటర్వెల్ ఇవ్వాలి. ఇది రాజమౌళి మొదట అనుకున్న ఇంటర్వెల్.
ప్రస్తుతం ఉన్న సినిమాలో శివుడు రకరకాల దశలు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలను దాటుకుంటూ మాహిషృతి సామ్రాజ్యంలోకి వస్తాడు. నిజానికి ఈ సన్నివేశాన్ని కూడా రాజమౌళి వేరేలా ప్లాన్ చేశాడు. శివుడు మాహిషృతిలోకి వచ్చే ముందు మంచు కొండల్లో సైనికులతో పోరాటం చేస్తాడు. ఆ సమయంలో ఓ సైనికుడు శివుడిని చూసి బాహుబలి అని భ్రమ పడి.. ‘ప్రభూ.. నన్ను క్షమించండి’ అని వేడుకుంటాడు. ఆ తర్వాత అతను వచ్చి, బిజ్ఞలదేవుడికి బాహుబలి బతికే ఉన్నాడని చెబుతాడు.

కానీ, బిజ్ఞలదేవుడు మాత్రం.. ‘లేదు, బాహుబలి చచ్చిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి నలిపి మట్టిలో కలిపేశాం’ అని అనగానే ఇటువైపు మట్టి గోడను బద్దలు కొట్టుకుని శివుడు రావాలి. ‘వాడి శరీరాన్ని మంటల్లో కలిపేశాం’ అనగానే అగ్ని కీలలను దాటుకుంటూ రావాలి. ఇలా బిజ్ఞలదేవుడు చెప్పే ఒక్కో డైలాగ్‌కు ఒక్కో దశను దాటుకుంటూ శివుడు వచ్చేలా రాజమౌళి మొదట స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇక్కడే ఇంటర్వెల్ వేద్దామనుకున్నారు.
కానీ, విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వేస్తే బాగుంటుందని భావించి బిజ్ఞలదేవుడి డైలాగ్స్ అన్నీ తీసేశారు. ఆ తర్వాత ‘శివుడి మాహిషృతికి
బయలుదేరే సన్నివేశాలను “నిప్పులే శ్వాసగా’ అంటూ సాంగ్‌లా తీశాం.” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read:Megastar Chiranjeevi: అభిమానులకు చిరాకు రప్పిస్తున్న మెగాస్టార్ సరికొత్త నిర్ణయం
[…] […]