Homeజాతీయ వార్తలుRajasthan : ఆస్తులమ్మి భార్యని చదివించాడు.. నౌకరీ వచ్చాక భర్తను వదిలేసింది... భర్త ఇచ్చిన షాక్‌తో...

Rajasthan : ఆస్తులమ్మి భార్యని చదివించాడు.. నౌకరీ వచ్చాక భర్తను వదిలేసింది… భర్త ఇచ్చిన షాక్‌తో దిమ్మ తిగిరి బొమ్మ కనిపించింది..!

Rajasthan : భారత దేశ హిందూ వివాహ వ్యవస్థలోకి పాశ్చాత్య సంస్కృతి క్రమంగా చొరబడుతోంది. ఒకప్పుడు హిందూ వివాహ వ్యవస్థను చూసి అందరూ చేతులెత్తి నమస్కరించేవారు. కానీ, ఇప్పుడు యువతులు, మహిళల తీరుతో గౌరవం తగ్గిపోతోంది. వివాహేతర సంబంధాలు, స్వేచ్ఛ పేరుతో భర్త, అతింట్టివారిని వేధించడం, కోర్టుల చుట్టూ తిప్పడం వంటివి పెరుగుతున్నాయి. వీటిలో కొన్ని నిజమైనవే అయినా.. చాలా మంది అమాయకులు కూడా బలవుతున్నారు. ఇక చదువుకుంటే సంస్కారం వస్తుందని పెద్దలు అంటారు. కానీ చదువుకున్న వారే ఎక్కువగా విడిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఆదాయం, లగ్జరీ లైఫ్, కోరికలు ఇలా అనేకం విడాకులకు కారణమవుతున్నాయి. తాజాగా ఓ మహిళ తనకు ఉద్యోగం రావడంతో భర్తనే వదిలేసింది.

ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌ రాష్ట్రం కోటాకు చెందిన మనీశ్‌మీనా, సప్న మీనా దంపతులు. తన భార్యకు చదువుపై ఆసక్తి ఉండడంతో ఆమెను చదివించి ప్రయోజకురాలిని చేయాలనుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. ఉన్న భూమి తాకట్టు పెట్టి.. తన భార్య కోరిక మేరకు చదివించాడు. రూ.15 లక్షల వరకు ఖర్చు చేశాడు. సప్న మీనా కడా బాగా చదివింది. ఉన్నత చదువు పూర్తయ్యాక 2023లో రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేసింది. ఫలితాల్లో ఉద్యోగం వచ్చింది. దీంతో సప్నమీనాతోపాటు మనీశ్‌ మీనా కూడా చాలా సంతోష పడ్డారు.

ఉద్యోగం లేదని భర్తను దూరం పెట్టి..
తనను చదివిపించినన్ని రోజులు భర్తతో కలిసి ఉన్న సప్ప మీనా.. కోసం మనీశ్‌ మీనా చాలా ఓపికగా ఉన్నాడు. ఆమె కోసం అన్నీ త్యాగం చేశాడు. కానీ, రైల్వే ఉద్యోగం రాగానే సప్న తీరులో మార్పు వచ్చింది. తనకు ఉద్యోగం ఉందని విర్రవీగింది. అహంకారం ప్రదర్శించింది. చివరకు భర్త మనీశ్‌నే దూరం పెట్టింది. దీంతో తన భార్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు మనీశ్‌..

సాక్ష్యాధారాలతో నిరూపించి…
ఇక తన భార్యకు ఉద్యోగం కారణంగానే అహంకారం పెరిగిందని గుర్తించిన మనీశ్‌..వాస్తవంగా ఆమె సొంత టాలెంట్‌తో ఉద్యోగం రాలేదని నిరూపించాడు. ఇందుకు సాక్ష్యాధారాలు కూడా తీసుకువచ్చాడు. ఈమేరకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సప్న మీనాను అధికారులు సస్పెండ్‌ చేశారు. దీంతో ఇప్పుడు సప్న మీన ఉద్యోగం కోల్పోయి ఇంటి పట్టున ఉంటుంది.

టిట్‌ ఫర్‌ టాట్‌..
భార్యను చదివించి ప్రయోజకురాలిని చేసి ఆమెకు ఉద్యోగం వచ్చేందుకు సహకరిస్తే. ఉద్యోగం వచ్చాక తాను ప్రయోజకురాలు కావడానికి కారణమైన భర్తనే దూరం పెట్టింది ఆ మహిళ. దీంతో టిట్‌ఫర్‌ టాట్‌ అన్నట్లుగా భర్త మనీవ్‌ కూడా సరిగ్గా బుద్ధి చెప్పాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సప్నను తిట్టిపోస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular