UP Election 2022 BJP Victory: ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. యోగి ఆదిత్యానాథ్ త్వరలో సీఎం సీట్లో కూర్చోనున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. దీంతో కమలం పార్టీకి ఇది ఎలా సాధ్యమైంది..? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక దేశంలోని అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే కేంద్రంలో ఆ పార్టీ ఉండే అవాకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో యూపీని బీజేపీకి చేజక్కించుకోవడం వెనుక అనేక కారణాలున్నాయి. వాటి గురించి పరిశీలిద్దాం..
ఉత్తప్రదేశ్లో ఒకప్పుడు నేరగాళ్లకు అడ్డా.. అని పేరుండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 2017లో యోగి సర్కార్ వచ్చిన తరువాత చేసిన మొట్టమొదటి పని నేరాలను నియంత్రించడం. హోంశాఖ తన వద్దే ఉంచుకున్న యోగి ఎప్పటికప్పుడు నేర సమీక్షలు చేసేవారు. గత ఐదేళ్లలో 182 మంది నేరస్థులను హతమార్చారు. 4,206 మంది కాళ్లపై కాల్పులు జరిపారు. 21,625 మంది జైళ్లలోనే ఉంచారు. మొత్తంగా 72 శాతం బందిపోటు ఘటనలు, 62 శాతం దోపిడీలు, 31 శాతం హత్యలు, 50 శాతం అత్యాచారాలు తగ్గినట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి.
Also Read: దేశంలోనే అత్యధికం..ఈయనకు 1.79 లక్షల ఓట్ల మెజారిటీ
యూపీలో బీజపీ ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాలను అనేకంగా ప్రవేశపెట్టింది. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్ పేరుతో విడుదల చేసిన మెనిఫెస్టోలో ‘ప్రీ రేషన్,’ ఉచిత కరెంట్, మద్దతు ధర హామీలు ఉన్నాయి. ఇవి ప్రజలను బీజేపీ వైపు వెళ్లేట్లు చేశాయి. గత ఐదేళ్లలో యోగి సర్కార్ చేసిన అభివృద్ధి కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి ఈ ఐదేళ్లలో జరగడంతో యోగిపై నమ్మకం పెట్టుకున్నారు యూపీ ప్రజలు. ఈ ఐదేళ్లలో ఏం చేశాం.. మరో ఐదేళ్లలో ఏం చేస్తాం.. అనే నినాదం సక్సెస్ అయింది.
దేశంలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆయోద్య రామాలయం నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. యూపీలో 80 శాతం హిందువులు ఉండడంతో ఈ అంశం బాగా కలిసొచ్చింది. దీనిని సెంటిమెంట్ గా భావించి బీజేపీకి ఓట్లు వేశారు. ఇక కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండడంతో పార్టీ పెద్దలు మోదీ, షాలు యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాకుండా మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి కూడా ఈ రాష్ట్రంలో ఉండంతో మోదీ పదే పదే రాష్ట్ర పర్యటన చేశారు.
కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాలు బీజేపీకి మైనస్ గా మారాయి. సంవత్సరం పాటు ఆందోళన చేసిన రైతుల్లో యూపీకి చెందిన వారు కూడా ఉన్నారు. అంతేకాకుండా లఖింపూర్ ఖేరి, హథ్రాస్, ఉన్నావ్ ఘటనతలో బీజేపీపై పెద్ద దెబ్బ పడుతాయని భావించారు. కానీ ఆ ప్రభావం ఏమాత్రం చూపలేదు. అంతేకాకుండా రైతు చట్టాలను రద్దు చేస్తూ రైతులకు మోదీ స్వయంగా క్షమాపణలు చెప్పడం కలిసొచ్చింది. దీంతో కేంద్రంపై పోరు చేసిన రైతులే మోదీకి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక యూపీలో ముఖ్యంగా కుల సమీకరణాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని నెలల కిందట యోగికి బ్రాహ్మణ, జాట్ వర్గాలు దూరంగా ఉన్నాయన్న ప్రచారం సాగింది. ఇక ముస్లిం, బీసీ, ఇతర వర్గాలు ఎలాగూ దూరంగా ఉంటాయని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకోవాలని అనుకున్నాయి. కానీ బ్రాహ్మణ వర్గాలతో పాటు ముస్లిం ఓటు బ్యాంకు కూడా యోగికే వెళ్లినట్లు తెలుస్తోంది. యోగి చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు వీరంతా ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. ఇలా మొత్తంగా మోదీ, షా, యోగిలు కలిసి యూపీనలో గెలిచి యూపిలో కొత్త రికార్డు సృష్టించారు.
Also Read: యూపీలో ఎంఐఎం వల్ల ఎస్పీ ఘోరంగా ఓడిపోయిందా? బీజేపీ గెలిచిందా?