https://oktelugu.com/

జగన్ పైకి రఘురామ రాజు మరో అస్త్రం..!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైకి మరో కొత్త అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. వారానికి ఓ అంశంపై లేఖ రాస్తున్న ఎంపీ ఈ వారం మాజీ ప్రధాని పివి నర్సింహారావు శతజయంతి ఉత్సవాల అంశాన్ని తేవనెత్తారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన పీవీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణా ప్రభుత్వం ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏందుకు నిర్వహించడం లేదన్నారు. పివి తెలంగాణా బిడ్డ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 28, 2020 / 04:25 PM IST
    Follow us on


    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైకి మరో కొత్త అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. వారానికి ఓ అంశంపై లేఖ రాస్తున్న ఎంపీ ఈ వారం మాజీ ప్రధాని పివి నర్సింహారావు శతజయంతి ఉత్సవాల అంశాన్ని తేవనెత్తారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన పీవీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణా ప్రభుత్వం ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏందుకు నిర్వహించడం లేదన్నారు. పివి తెలంగాణా బిడ్డ అయినప్పటికీ రాష్ట్రంతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పీవీ ఎంపీగా గెలుపొందారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

    Also Read: కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప

    వచ్చే కేబినెట్ సమావేశంలో పీవీకి భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలన్నారు. ప్రజలు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయాలని, ఇతర మార్గాలలో ఈ విషయాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ఎంపీగా గెలిచారని తెలిపారు. పీవీ తెలుగువారీ ఠీవీ అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని చెప్పారు.

    Also Read: బీజేపీపై బాబు ఆశలు గల్లంతేనా?

    తెలంగాణా ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే పీవీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడైనా ఆ పార్టీ నాయకులు ఎవరూ ఇంత వరకూ ఈ డిమాండ్ లేవనెత్తలేదు. దీంతో ఇప్పటి వరకూ ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేకుండా ఉంది. ఇప్పుడు సొంత పార్టీ ఎంపీనే పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేయడం, స్వయంగా ముఖ్యమంత్రి లేఖ రాయడంతోపాటు, ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించడంతో వైసీపీ ప్రభుత్వం సంకటంలో పడింది. ఈ అంశంపై బయట పడేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. ఉత్సవాలను నిర్వహిస్తే ఎంపీ రఘురామ కృష్ణంరాజుకే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఉత్సవాలు నిర్వహించకుండా ఈ సమస్య నుంచి ఎలా