Kcr vs Modi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే చీటికి మాటికి కేంద్రపంఐ దాడికి దిగుతోంది. ఇన్నాళ్లు విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా తన జోలికి రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తుంటే కేసీఆర్ లో భయం పెరిగిందని తెలుస్తోంది. తన దారికి అడ్డు రావద్దని చెప్పడం చూస్తుంంటే ఇంకా ఏం జరుగుతుందో అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ సభలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి అల్టిమేటం జారీ చేయడం చూస్తుంటే కేసీఆర్ లో భయం నీడలు భయపెడుతున్నాయని తెలుస్తోంది. అందుకే కేంద్రంపై ప్రత్యక్షంగా పోరుకు దిగుతున్నట్లు సమాచారం.
బీజేపీ నేతలు కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతుంటే కేసీఆర్ కు రోజురోజుకు భయం గుప్పిట్లో వణుకుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ చేసిన తప్పులన్ని ఆధారాలతో సహా కేంద్రం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ లో భయం ఇంకా పెరుగుతున్నట్లు సమాచారం. బీజేపీ పై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ తమ తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రధానిపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read: విష్ణు నో చెప్పి ఉంటే నేను ఓకే చెప్పవాడిని కాదు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..!
మరోవైపు రాష్ట్రంలో పరిపాలనలో వెల్లువెత్తుతున్న ఆరోపణలపై సమాధానం చెప్పలేక పోతున్నారు. ప్రజల్లో కూడా వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. అది వచ్చే ఎన్నికల నాటికి తీవ్రమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకే అప్పుడు కేసీఆర్ అవినీతి బయటపెట్టి ఆయనను జైలుకు పంపే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతలకు ఈ విషయం తెలియడంతోనే ఎటూ తేల్చుకోలేక తమ దారికి అడ్డు రావొద్దని హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే ఇది నిజమే అనే అనుమానాలు వస్తున్నాయి.
కేసీఆర్ ఇంతలా కోపం ప్రదర్శిస్తుంటే అందరికి అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. కేసీఆర్ కు స్పష్టమైన సమాచారం రావడంతోనే ఆయనలో అక్కసు పెరిగిపోతోందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ నేతలు కూడా కేసీఆర్ నిర్వాకంపై ఓ కన్ను వేసినట్లు తెలుస్తోంది. అందుకే టీఆర్ఎస్ నేతల్లో వణుకు పుడుతోందని సమాచారం. బీజేపీ నేతలను కూడా టార్గెట్ చేసుకుని తమలో ఉన్న భయం పోగొట్టుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా కేసీఆర్ కు కాలం చెల్లిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
దీంతోనే ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే కనీసం మర్యాద కోసం కూడా పలకరించేందుకు వెళ్లకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీంతో బీజేపీ నేతలు వేసిన సెటైర్లకు సమాధానం చెప్పలేక పోయిన సంగతి తెలిసిందే. మొత్తానికి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరులో కేసీఆర్ కథ ఎక్కడికి వెళుతుందో తెలియడం లేదు.
Also Read: ఉగాది నుంచి కొత్త పాలనకు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్?