KCR: కేసీఆర్ అంటేనే రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరొందిన నేత. రాబోయే ప్రమదాన్ని ముందే పసిగట్టి దాన్ని తన దరి చేరకుండా అడ్డుకోగల నేర్పరి. ఏ పని చేసినా సరే తనకు సానుభూతి వచ్చేలా చూసుకునే దిగ్గజం. ఆయన నోటి నుంచి అనుకోకుండా కొన్ని ప్రముఖమైన మాటలు వచ్చాయంటే దాని వెనక ఓ వ్యూహం ఉన్నట్టే అంటారు రాజకీయ నిపుణులు. కాగా ఇప్పుడు ఆయన మోడీపై విరుచుకుపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే హెచ్చరిస్తున్నారు.
మొన్న జనగామలో మాట్లాడుతూ.. తన జోలికి రావొద్దని, మోడీ అవినీతి చిట్టా తన దగ్గర ఉందంటూ చెబుతున్నారు. అలాగే భువనగిరిలో మాట్లాడుతూ మీ జాగ్రత్తలో మీరు ఉండండి, మా జాగ్రత్తలో మేం ఉంటాం అంటూ కొన్ని సందేశాలను పంపుతున్నారు. ఈ వ్యాఖ్యల వెనక అర్థం వేరే ఉందట. కేసీఆర్‌కు విచారణ టెన్షన్ పట్టుకుందని, అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారనే టాక్ వస్తోంది.
Also Read: ఉగాది నుంచి కొత్త పాలనకు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్?
గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలు కేసీఆర్ మీద విచారణ జరపడం ఖాయం అని, అతను జైలుకు వెళ్లడం కూడా కన్ఫర్మ్ అంటూ సంచలన కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర పతి ఎన్నికలు జరిగిన తర్వాత ఇది ఉండే అవాకశం ఉందంటూ చెబుతున్నారు. ఇక కేసీఆర్‌కు కూడా కొన్ని పథకాల విషయంలో అలాగే మేఘా లాంటి కంపెనీలతో ఉన్న లింకుల గురించి బహిరంగ రహస్యమే.
అలాగే బీజేపీ వ్యతిరేక పార్టీలకు కూడా కేసీఆర్ డబ్బులు ఇచ్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి బీజేపీ తలుచుకుంటే.. కేసీఆర్ మీద ఏదో ఒక విచారణకు ఆదేశించే అవకాశం లేదని కేసీఆర్‌కు తెలియంది కాదు. కాబట్టి వేరే మార్గం లేక కేసీఆర్ ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ హెచ్చరికలు మోడీ భయపడుతారా అంటే సమాధానం లేదు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలను తమ పలుకుబడి ఉపయోగించి మార్చేసిన ఘనత బీజేపీది. మరి కేసీఆర్‌కు మోడీ ఏమైనా వెనకడుగు వేస్తారా అంటే కుదరని పని. కాకపోతే కేసీఆర్ ఏదో తన బలాన్ని చూపించాలనే నేపథ్యంలోనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారనే వాదన అయితే వినిపిస్తుంది.
Also Read: అప్పటి నుంచి తెరుచుకోనున్న ఐటీ కంపెనీలు.. రెడీ అంటున్న ఉద్యోగులు..!