https://oktelugu.com/

Samantha: కొత్త ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న‌ స‌మంత‌.. ఆమె ఎవ‌రంటే..?

Samantha:  అత్యంత త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన హీరోయిన్ అంటే స‌మంత పేరే ముందుగా గుర్తొస్తుంది మ‌నంద‌రికీ. కాగా ఆమె జీవితంలో ఎంత ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిందో.. అంతే ఫాస్ట్ గా నాగ‌చైత‌న్య‌తో పెండ్లి, ఆ త‌ర్వాత విడాకులు కూడా అయిపోయాయి. కాగా మొన్న‌టి వ‌ర‌కు కొంత మూడ్ ఆఫ్ అయిన‌ట్టు క‌నిపించిన సామ్.. ఇప్పుడిప్పుడే త‌న కెరీర్‌లో బిజీ అవుతోంది. అన్నీ మ‌ర్చిపోయి సంతోషంగా గ‌డుపుతోంది. స‌మంత‌. కాగా తెలుగుతో పాటు […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 13, 2022 / 04:23 PM IST
    Follow us on

    Samantha:  అత్యంత త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన హీరోయిన్ అంటే స‌మంత పేరే ముందుగా గుర్తొస్తుంది మ‌నంద‌రికీ. కాగా ఆమె జీవితంలో ఎంత ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిందో.. అంతే ఫాస్ట్ గా నాగ‌చైత‌న్య‌తో పెండ్లి, ఆ త‌ర్వాత విడాకులు కూడా అయిపోయాయి. కాగా మొన్న‌టి వ‌ర‌కు కొంత మూడ్ ఆఫ్ అయిన‌ట్టు క‌నిపించిన సామ్.. ఇప్పుడిప్పుడే త‌న కెరీర్‌లో బిజీ అవుతోంది. అన్నీ మ‌ర్చిపోయి సంతోషంగా గ‌డుపుతోంది. స‌మంత‌.

    Samantha

    కాగా తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది స‌మంత‌. పైగా పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా చేస్తోంది. సామ్‌. ఆమెకు హాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయంట‌. విడాకుల త‌ర్వాత ఆమె జోష్ పెరిగింద‌ని అంటున్నారు చాలామంది. అయితే ఇండ‌స్ట్రీలో ఆమెకు ఫ్రెండ్ ఎవ‌రైనా ఉన్నారా అంటే.. ఇద్ద‌రి పేర్లే ముఖ్యంగా వినిపిస్తుంది. వారే శిల్పారెడ్డి, నీరజ కోన.

    Also Read: ఆ భ‌యంతోనే కేసీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా..?

    వీరితోనే ఎక్కువ‌గా పార్టీలు, టూర్లుకు వెళ్తుంది స‌మంత‌. అయితే ఇప్పుడు ఆమెకు మ‌రో కొత్త ఫ్రెండ్ దొరికేసిందంట‌. ఆమెతో క‌లిసి చిల్ అవుతోంది. సామ్. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదండోయ్‌.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ క‌లిసి యశోద అనే పాన్ ఇండియా మూవీలో క‌లిసి న‌టిస్తున్నారు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత్యం పెరిగిందంట‌. సెట్ లో ఇద్ద‌రూ క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతుండ‌టంతో త్వ‌ర‌గానే ఫ్రెండ్ షిప్ పెరిగిందంట ఇద్ద‌రికీ.

    Samantha

    దీంతో ఇద్ద‌రూ క‌లిసి పార్టీలు చేసుకుంటూ.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంట‌. సినిమా షూటింగ్‌లో గ్యాప్ దొరికితే ఇద్ద‌రూ క‌లిసి ట్రిప్‌కు వెళ్తున్నారంట‌. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటున్నారు ఇద్ద‌రూ. దీంతో సామ్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఇన్ని రోజుల‌కు ఆనందంగా క‌నిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

    Also Read: ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా చేసింది.. యువతి రాసిన లేఖ వైరల్..

    Tags