Ravela Kishore Babu: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా పత్రాన్ని సోము వీర్రాజుకు పంపించి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు. దీంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. రాష్ర్టంలో క్రీయాశీలకంగా వ్యవహరించాలని చూస్తున్న పార్టీకి నష్టమే అని చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా నేతలు ఆలోచిస్తున్న క్రమంలో కిషోర్ రాజీనామా సంచలనం సృష్టిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ అధికారిగా ఉన్న కిషోర్ మొదట టీడీపీలో చేరి 2014లో ప్రత్తిపాడు నుంచి గెలిచి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. కానీ తరువాత క్రమంలో ఏమైందో కానీ పార్టీకి క్రమంగా దూరమయ్యారు. పార్టీపై విమర్శలు చేస్తూ వివాదాస్పదంగా మారారు. దీంతో టికెట్ ఇవ్వరని తెలుసుకుని జనసేన పార్టీలో చేరి కూడా కొంత కాలం పని చేశారు. తరువాత బీజేపీలో చేరారు.
Also Read: North Korea: ఉత్తరకొరియాలో ఏం జరుగుతోంది.? ప్రపంచానికి మరో వినాశనమా?
కిషోర్ మళ్లీ టీడీపీలో చేరాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే అమరావతి ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి సొంత గూటికే చేరాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి బీజేపీకి మాత్రం నష్టమే కలిగించినట్లు తెలుస్తోంది.
టీడీపీ అధినేత పార్టీని విడిచి వెళ్లిన వారికి మళ్లీ అవకాశం ఇస్తారా? అనేదే తేలాల్సి ఉంది. ఆయన ఇదివరకే యువతకు పెద్దపీట వేస్తామని చెప్పడంతో సీనియర్లకు మొండిచేయి ఇస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో రావెల కిషోర్ ఆశలు నెరవేరతాయా? అన్న దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. బాబు నిర్ణయం ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియడం లేదు. మొత్తానికి కిషోర్ ఆశలు నెరవేరతాయా? కిషోర్ ను పార్టీలో చేర్చుకుంటారా అనేదే అనుమానంగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Also Read:YSR Rythu Bharosa: రైతులకు భరోసా రూ.ఐదున్నరవేలేనా జగన్ సార్?
Recommended Videos: