https://oktelugu.com/

New Ration Card : రేషన్ కార్డు కోసం ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదా? అయితే ఇది మీకోసమే..

ప్రస్తుతం తెలంగాణలో కేవలం సరుకుల కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీతో పాటు పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2024 / 09:58 AM IST

    new ration card

    Follow us on

    New Ration Card : దేశంలో ఒక వ్యక్తికి ‘ఆధార్ కార్డు’తో గుర్తింపు ఉంటుంది. ఆ తరువాత రేషన్ కార్డు కు ప్రాధాన్యత కలిగింది. ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం నుంచి ఆహార సరుకులను అందించేందుకు రేషన్ కార్డును జారీ చేస్తారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో కేవలం సరుకుల కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీతో పాటు పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు తీసుకోవాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పలు సంక్షేమ పథకాల్లో ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డుల్లో నిజమైన లబ్ధిదారులను ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డులను అందించనుంది. అయితే కొత్త రేషన్ కార్డులు ఎవరికి వస్తాయంటే?

    ఇటీవల రేషన్ కార్డుల ఈ కేవైసీ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా జనవరి 31 వరకు గడువు నిర్ణయించారు. ఆ తరువాత పొడిగించారు.ఈ తరుణంలో మరణించిన వారివి, భోగస్ పేర్లు తీసేయనున్నారు. ఇదే సమయంలో కొత్తవారికి రేషన్ కార్డులు అందించనున్నారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అయితే చాలా మంది అర్హులుగా ఉన్నా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోలేదు. వారు తప్పకుండా అప్లై చేసుకోవాలని ప్రభుత్వ తెలుపుతోంది.

    పలు సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించేలా ఇటీవల ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో లబ్ధిదారులు ఫుల్ డీటేయిల్స్ తీసుకున్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన ఆన్ లైన్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ప్రజా పాలనలో భాగంగానే చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆహార సరఫరాల శాఖ ద్వారా నేరుగా దరఖాస్తులను కోరింది. అందువల్ల ఇప్పటికైనా దరఖాస్తులను ఇవ్వాలని తెలిపింది.

    కొంత మంది అవసరం లేకున్నా రేషన్ కార్డును తీసుకున్నారు. నిజమైన లబ్ధిదారుల్లో చాలా మందికి రేషన్ కార్డు లేదు. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించేందుకు ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో లబ్ధిదారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీల పథకాలకు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు తప్పని సరి చేశారు. అందువల్ల రేషన్ కార్డులు లేనివారు ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.