https://oktelugu.com/

Ramoji Rao Assets: బాబు చేసిన నాటి మేళ్ళు..రామోజీ ఆస్తులు లక్షన్నర కోట్లు

రామోజీరావు ఈ స్థాయిలో ఎదగడం వెనుక పచ్చ పార్టీ ఉంది. పచ్చ పార్టీ అధినేత ఎన్టీ రామారావు కు నాడు రామోజీరావు తెర వెనుక సహాయం చేశారు.

Written By: , Updated On : August 7, 2023 / 12:05 PM IST
Ramoji Rao Asset

Ramoji Rao Asset

Follow us on

Ramoji Rao Assets: హైదరాబాదు లాంటి ఒక కాస్మో పాలిటన్ నగరంలో రెండు వేల ఎకరాల భూమి ఒక వ్యక్తికి ఉంది.. పైగా ఆ భూమికి తగ్గట్టుగా ఫ్లై ఓవర్లు, విశాలమైన రోడ్లు, చట్టాల్లో మినహాయింపులు, ప్రభుత్వపరంగా వెసలు బాట్లు.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. తెలుగు నాట మీడియా మొఘల్ గా పొందిన రామోజీరావు. కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలుకుతున్న వేళ ఒక్కసారి ఆయన ఆస్తులు లెక్కవేస్తే లక్షన్నర కోట్లుగా తేలింది. అది కూడా కేవలం ఫిలిం సిటీ పరిధిలో ఉన్న 2000 ఎకరాలను లెక్కలోకి తీసుకుంటేనే.. సీతమ్మధార నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు లెక్కిస్తే అది మరింత పెరుగుతుంది.

రామోజీరావు ఈ స్థాయిలో ఎదగడం వెనుక పచ్చ పార్టీ ఉంది. పచ్చ పార్టీ అధినేత ఎన్టీ రామారావు కు నాడు రామోజీరావు తెర వెనుక సహాయం చేశారు. తన పత్రికలో ప్రచురితమయ్య అక్షరాలకు పసుపు రంగు పూసి మరి తెలుగు వారి ఆత్మ గౌరవం అంటూ సెంటిమెంట్ రగిలించారు. ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి రావడంతో అకస్మాత్తుగా రామోజీరావు యూటర్న్ తీసుకున్నాడు. చంద్రబాబు పల్లవి అందుకున్నాడు. ఇద్దరికీ వేవ్ లెంగ్త్ సరిగా కుదరడంతో పాలు, నీళ్లలాగా కలిసిపోయారు. దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలారు. అధికారికంగా ఒకరు రాష్ట్రాన్ని ఏలితే.. మరొకరు అనధికారికంగా ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించారు. ఇలా అప్రతిహతంగా వారి ప్రయాణం సాగింది. అది ఏకంగా అబ్దుల్లా పూర్ మెట్ అనే మండలాన్ని గుంప గుత్తగా స్వాధీనం చేసుకునే వరకు వెళ్లింది.

రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటైన అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం ఒకప్పుడు రాళ్ల దిబ్బలతో ఉండేది. అక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉండేవి. ఒక వ్యక్తికి గరిష్టంగా 12 ఎకరాలకు మించి ఉండకూడదనే నిబంధన ఉండేది. చంద్రబాబు వీటన్నింటినీ సమూలంగా మార్చేశాడు. కేవలం రామోజీ ఫిలిం సిటీ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని విధాలుగా ఉపయోగించాడు. కేవలం రామోజీ ఫిలిం సిటీ కోసం సికింద్రాబాద్ నుంచి ఫ్లై ఓవర్ నిర్మించారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా ఫిలిం సిటీ ఏర్పాటైన ప్రాంతంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా రామోజీరావుకు ధారాదత్తం చేశారు. ఫలితంగా రామోజీరావు తిరుగులేని విధంగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దాడు. ప్రపంచ సినీ జగత్తులోనే ఈ స్థాయిలో భూమి ఉన్న ఏకైక స్టూడియో రామోజీ ఫిలిం సిటీ మాత్రమే. హైదరాబాదు లాంటి కాస్మోపాలిటన్ నగరంలో 2000 ఎకరాల భూమి కలిగిన వ్యక్తి కూడా రామోజీరావు ఒక్కడే.