https://oktelugu.com/

Allu Aravind: పన్నెండేళ్లు పోరాటం చేసి జైలుకు పంపా… జీవిత రాజశేఖర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్

చాలా సంవత్సరాల క్రితం రాజశేఖర్ జీవిత చేసిన వ్యాఖ్యలపై వారి మీద పరువునష్టం దావాను వేశాడు అల్లు అరవింద్. అది కోర్టులో అలా అలా ముందుకు నడుస్తూ ఈ మధ్యే తీర్పు వచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా కోర్టు విధించారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 7, 2023 / 11:59 AM IST

    Allu Aravind

    Follow us on

    Allu Aravind: చిరంజీవి, జీవిత రాజశేఖర్లకు ఎప్పటినుంచో లోపల తెలియని వివాదాలు ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జీవిత రాజశేఖర్ దంపతులు చిరంజీవి ని ఏదో ఒక విధంగా అనేక సందర్భాలలో పాయింట్ అవుట్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన కొత్తలో జీవితా రాజశేఖర్‌లు కొంచెం ఘటైన కామెంట్లే చేస్తూ వచ్చారు. చిరంజీవిని కిందకు లాగేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశారు.

    ముఖ్యంగా చిరంజీవి ఎంతో సేవాదృక్పథంతో పెట్టిన బ్లడ్ బ్యాంక్ మీద కూడా ఆరోపణలు, విమర్శలు చేశారు. రక్తం అమ్ముకుంటున్నారని అప్పట్లో వారిద్దరూ చేసిన కామెంట్లకు ఈ మధ్యే శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే వారికి శిక్ష పడడానికి సుదీర్ఘ ప్రయత్నం చేసింది మాత్రం అల్లు అరవింద్. ఇక ఇదే విషయం గురించి మరోసారి ప్రస్తావించారు ఈ నిర్మాత. నిన్న జరిగిన బోళా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఈ విషయం గురించి మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

    అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆయన చూడని సక్సెస్ ఉందా? నేను ఆయనను ప్రత్యేకంగా విషెస్ చెప్పాల్సిన పని లేదు.. మీరంతా ఆయన సినిమాలు చూసి పెరిగితే.. నేను చేస్తూ పెరిగాను.. నేను ఆయన్ను ఎంత ప్రేమిస్తాను.. ఎంత అభిమానిస్తాను అని ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ఆయన చేసే సేవలను, కార్యక్రమాలను ఒకళ్లు నీచంగా మాట్లాడారని.. పన్నెండేళ్లు పోరాటం చేసి జైలుకెళ్లే వరకు ఊరుకోలేదు’ అని తనకు చిరంజీవి పైన ఉన్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరిచారు అల్లు అరవింద్.

    చాలా సంవత్సరాల క్రితం రాజశేఖర్ జీవిత చేసిన వ్యాఖ్యలపై వారి మీద పరువునష్టం దావాను వేశాడు అల్లు అరవింద్. అది కోర్టులో అలా అలా ముందుకు నడుస్తూ ఈ మధ్యే తీర్పు వచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా కోర్టు విధించారు. ఇక ఇదే విషయాన్ని అల్లు అరవింద్ పరోక్షంగా స్టేజ్ మీద గుర్తు చేశాడు.

    ఇక బోళా శంకర్ సినిమా విషయానికి వస్తే, 2015లో రిలీజ్ అయిన తమిళ్ చిత్రం వేదాళంకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతోంది.