ABN RK- Ramoji Rao: ముద్రణా వ్యయాలు, రవాణా భారం, పంపిణీ కష్టాలు.. వెరసి పత్రిక రంగాన్ని కుదేలు చేస్తున్నాయి.. దేశమంతటా ఇదే పరిస్థితి. కొవిడ్ వల్ల పెద్ద పెద్ద పత్రికలు డిజిటల్ మాధ్యమంలోకి వెళ్లిపోయాయి. తెలుగు పత్రికలు అయితే తమ సర్క్యులేషన్ ను దారుణంగా కోల్పోయాయి.. ఆ మధ్య ఓ మీడియా వ్యవహారాల వెబ్సైట్ కొన్ని అంకెలు ప్రచురించింది.. జాతీయస్థాయిలో పెద్దపెద్ద పత్రికల సర్క్యులేషన్ గడచిన రెండేళ్లలో దారుణంగా పడిపోయిందని లెక్క కట్టింది.. తెలుగు పత్రికలు కూడా అదే దారిలో ఉన్నాయి.. అసలు ఏ బి సి గణాంకాల ప్రకారం సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ పూర్వ ప్రభను కోల్పోయాయి. ఇదే దశలో ఆంధ్రజ్యోతి కొద్దిగా ధైర్యం తెచ్చుకుంది.. ఆ సంస్థ ఎండి వేమూరీ రాధాకృష్ణ ఉద్యోగులకు హెచ్ వో డీ ల నివేదికలతో పని లేకుండా బేసిక్ మీద 10% జీతం పెంచారు. ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో ఆంధ్రజ్యోతికి నిత్యం వైరమే. ప్రభుత్వాల నుంచి ప్రకటనలు వచ్చేది గగనమే.. ఇలాంటి తరుణాల్లో ఆ ఆర్థిక భారాన్ని మోసేందుకు రాధాకృష్ణ ముందుకు రావడం అభినందనీయం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో, పెరిగిన ఈ ధరలతో బోటా బోటీ జీతం తో జీవించడం అంటే చాలా కష్టం.

అప్పుడు ఇళ్ళకి పంపించారు
కోవిడ్ సమయంలో ఉద్యోగులను ఆంధ్రజ్యోతి ఇళ్లకు పంపించింది. అరకొర జీతాలు మాత్రమే ఇచ్చింది. గత ఏడాది కాస్త తేరుకుని ఐదు శాతం జీతాలు పెంచింది. కానీ ఇప్పుడు 10% హైక్ ఇచ్చింది.. జనరల్ డెస్క్ లో పనిచేసే వారికి మూడు విడుతలుగా హైక్ ఇచ్చింది ఇప్పుడు పత్రికారంగం ఉన్న స్థితిలో చెప్పుకోదగిన విశేషమే.. సబ్ ఎడిటర్లకు సగటున 2,500 నుంచి 3000 వరకు వేతనాలు పెరిగాయి.. ఇక డెస్క్ ఇంచార్జీలకు సగటున నాలుగువేల దాకా వేతనాలు పెరిగాయి. ఇదే సమయంలో కంట్రిబ్యూటర్లకు ఎప్పటిలాగే శూన్య హస్తం.
ఉంటే ఉండండి…పోతే పొండి
ఇక అధికార ప్రభుత్వాలకు డప్పు కొట్టే సాక్షి, నమస్తే తెలంగాణ లో పాత్రికేయుల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆ మధ్య నమస్తే ఉద్యోగులు పెన్ డౌన్ ప్రకటించారు. ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి వచ్చి బ్బాబ్బాబు మేనేజ్ మెంట్ తో నేను మాట్లాడతా అని హామీ ఇచ్చేదాకా వారు దిగి రాలేదు. మరి పెరుగుదల గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇక సాక్షి .. ఉద్యోగులపై తన కర్కషత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ జగన్ కేవలం ఐదు శాతం మాత్రమే విధిలించాడు. ఉంటే ఉండండి…పోతే పోండి అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. అయినా ఎక్కడికి పోతారు? ఈమాత్రం జీతాలు ఇచ్చేవాడు ఎవడున్నాడు? అదే కదా జగన్ ధీమా, అదే కదా పాత్రికేయుల దీనావస్థ.

రామోజీ వల్ల కాదా
పత్రికా రంగంలో సుదీర్ఘ చరిత్ర రామోజీరావుది.. ఈయన తో పోలిస్తే రాధాకృష్ణ అనుభవం చాలా తక్కువ.. అయితే ఉన్న ఉద్యోగులు చేయి జారిపోకుండా జీతాల్లో పెంపుదల కనబరిచాడు. కానీ ఇదే రామోజీరావు మళ్ళీ బాండెడ్ లేబర్ విధానానికి తెర లేపాడు.. ఇప్పటికీ ఈనాడు సంస్థల్లో ఉన్నవారు సరిగా పని చేయరు.. పైగా వారికి వేతనాలు కూడా ఎక్కువే.. ఇక ఈనాడు డిజిటల్.. అందులో శ్రమ దోపిడీ ఎక్కువ.. ఈ మధ్య రామోజీరావు ఈనాడు జర్నలిజం స్కూల్ లో ప్రవేశాలకు ఆహ్వానం అని ఒక యాడ్ వేశాడు. చాలామంది ఇది ప్రింట్ జర్నలిజం కోసం అనుకుంటున్నారు. కానీ కాదే కాదు.. ఈనాడు ప్రింట్ మీడియా ను పక్కకు పెట్టి చాలా రోజులైంది. బహుశా దానిని ఎక్కువ రోజులు నడిపించకపోవచ్చు.. ఆ మధ్య ప్రింట్ బాధ్యత కళాజ్యోతి సంస్థకు అప్పగించారని వార్తలు వచ్చాయి.. తాజా నోటిఫికేషన్ కేవలం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పని చేయించుకోవడం కోసమే.. అవసరం ఉన్నంత మేరకు శిక్షణ ఇస్తారు.. ప్రింట్ మీడియా కాదు కాబట్టి ఎటువంటి వేజ్ కమిషన్ పనిచేయదు.. కోవిడ్ వల్ల పరిస్థితులు దిగజారిపోయినప్పటికీ ఈనాడు తన పద్ధతి మార్చుకోలేదు. తనకు అచ్చి వచ్చిన బాండెడ్ లేబర్ పద్ధతికి మళ్ళీ శ్రీకారం చుట్టింది. మూడేళ్లపాటు ఈనాడు విభాగాల్లో ఎక్కడపడితే అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఈటీవీ, ఈటీవీ భారత్. మూడేళ్ల పాటు పనిచేస్తామని బాండ్ రాసి ఇవ్వాలి. ఏ పని చేతైనా బయటికి వెళ్తా మంటే కుదరదు. 50 వేల వరకు పరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. ఇదేం స్కూల్? ఇదేం శిక్షణ అంటారా? రామోజీ తీరు అలానే ఉంటుంది. గతంలో ఆ శిక్షణ నుంచి బయటపడటానికి చాలామంది చాలా ప్రయాసలేపడ్డారు.