Ramoji- Shailaja Kiran: Raoరామోజీ విచారణకు రాడా? ఆ ధైర్యమేంటి?

ఇక గతంలో నిర్వహించిన విచారణకు అంతంత మాత్రమే స్పందించిన రామోజీరావు.. ఈసారి గైర్హాజరు కావడం వెనుక పెద్ద మతలబే ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు చూపించి అటు రామోజీరావు ఇటు శైలజ విచారణ నుంచి తప్పించుకున్నారని ఏపీ సిఐడి వర్గాలు అంటున్నాయి. అనారోగ్య కారణాలు చూపిస్తే కోర్టు కూడా సమ్మతం తెలియజేస్తుంది.

Written By: Bhaskar, Updated On : July 6, 2023 3:42 pm

Ramoji- Shailaja Kiran

Follow us on

Ramoji- Shailaja Kiran: మార్గదర్శి కేసులో ఏపీ సిఐడి మరింత దూకుడుగా వెళ్తోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీపడటం లేదు. చివరికి బిజెపి నుంచి ఒత్తిడి రాకుండా ఉండేందుకు ముందే జాగ్రత్త పడ్డాడు. అయినప్పటికీ రామోజీరావు ముందు అతని పాచికలు పారడం లేదు. తాజాగా బుధవారం నిర్వహించిన విచారణకు రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ హాజరు కాలేదు. ఇదే సమయంలో ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను విచారించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు రాబట్టారు.

ఏపీ సిఐడి అధికారులు చెబుతున్న దాని ప్రకారం మార్గదర్శిలో బ్రాంచ్ మేనేజర్లు కేవలం పాత్రధారులు మాత్రమే అని.. అసలు సూత్రధారులు రామోజీరావు, ఆయన కోడలు శైలజ అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి బ్రాంచ్ల ద్వారా వసూలు చేసిన నగదును మొత్తం హైదరాబాదులోని కేంద్ర కార్యాలయానికి తరలించినట్టు సిఐడి అధికారులు చెబుతున్నారు. ఈ డబ్బులను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెట్టినట్టు వివరిస్తున్నారు. వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పేరుకు రిటర్న్స్ భారీగానే వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.. కానీ ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చందాదారుల నుంచి వసూలు చేసిన నగదు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు. అలాంటిది రామోజీరావు ఎందుకు అంత ధైర్యం చేశారు అనేది ఏపీ సిఐడి అధికారులకు అంతుపట్టడం లేదు. కానీ ఈ విషయాన్ని మార్గదర్శి యాజమాన్యం గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. పైగా చందాదారులకు చిట్టి లకు సంబంధించి మెచ్యూరిటీ పూర్తయినప్పటికీ నగదు ఇవ్వకపోవడం, చందాదారులు అడిగినప్పటికీ అధిక వడ్డీ చెల్లిస్తామని మభ్య పెట్టారని సిఐడి అధికారులు అంటున్నారు. దీనిని సాకుగా చూపించి చందాదారులు తమపై ఫిర్యాదు చేయడం లేదని మార్గదర్శి యాజమాన్యం చెబుతోందని వారు అంటున్నారు.

ఇక గతంలో నిర్వహించిన విచారణకు అంతంత మాత్రమే స్పందించిన రామోజీరావు.. ఈసారి గైర్హాజరు కావడం వెనుక పెద్ద మతలబే ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు చూపించి అటు రామోజీరావు ఇటు శైలజ విచారణ నుంచి తప్పించుకున్నారని ఏపీ సిఐడి వర్గాలు అంటున్నాయి. అనారోగ్య కారణాలు చూపిస్తే కోర్టు కూడా సమ్మతం తెలియజేస్తుంది. పైగా దర్యాప్తు సంస్థలను ముందుకు వెళ్లకుండా నిలువరిస్తుంది. సరిగా ఈ కారణాలు చూపించి రామోజీరావు విచారణకు హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల డిపాజిట్లు తగ్గిపోయిన నేపథ్యంలో రామోజీరావు చందాదారులకు వేరే ఇతర మార్గాల ద్వారా నగదు సమకూర్చుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాతనే ఆయన విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. మరి రామోజీరావు విచారణకు గైర్హాజరైనప్పటికీ మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ల స్టేట్మెంట్లు సిఐడి అధికారులు రికార్డు చేశారు. తాము డబ్బు మాత్రమే వసూలు చేశామని, యాజమాన్యం చెప్పినట్టు నడుచుకున్నామని సిఐడి అధికారుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై జగన్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే తదుపరి అడుగులు ఉంటాయని సిఐడి అధికారులు చెబుతున్నారు.