https://oktelugu.com/

వైసీపీ నాయకులపై ఈసీ సీరియస్

కరోనా ప్రత్యేక సాయాన్ని ప్రభుత్వం సిబ్బంది కాకుండా వైసిపి అభ్యర్థులు పంపిణీ చేయడాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై ఇప్పటికే బిజెపి, సిపిఐ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. ఈ లేఖలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కొన్నిచోట్ల అధికార పార్టీకి చెందిన, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన […]

Written By: , Updated On : April 6, 2020 / 04:25 PM IST
Follow us on

కరోనా ప్రత్యేక సాయాన్ని ప్రభుత్వం సిబ్బంది కాకుండా వైసిపి అభ్యర్థులు పంపిణీ చేయడాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై ఇప్పటికే బిజెపి, సిపిఐ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. ఈ లేఖలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కొన్నిచోట్ల అధికార పార్టీకి చెందిన, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పంపిణీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని, రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు నగదు సాయం పంపిణీ చేస్తూ ఎన్నికల ప్రచారానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారని ఇందుకు సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు, వీడియోలు సమర్పించినట్లు వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అమలులో లేదని, ఎన్నికలలో వాయిదా వేయడం వల్ల ప్రస్తుతం ప్రచారానికి అనుమతి లేదని తెలిపింది. నిబంధనలను ఉల్లంగించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే నివేదికలు రూపొందించే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు