Vanama Raghava: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ చేస్తున్న అరాచకాలకు అంతే లేదు. భూ దందాలు, సెటిల్‌మెంట్లు, అత్యాచారాలు ఇలా చెప్పుకుంటూ పోతే అతని చరిత్ర చాలానే ఉంది. వనమా రాఘవ కారణంగా పాల్వంచలో ఇటీవల తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు నాగ రామకృష్ణ. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చేసిన సెల్పీ వీడియో మరోటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆయన వీడియోలో ఎమన్నారో ఆయన మాటాల్లోనే ‘‘ మా నాన్నా పేరు చిట్టబ్బాయి. తూగో జిల్లాల మోతుగూడెంలో ఆరోగ్య శాఖలో హెల్త్ ఇన్ స్పెక్టర్‌గా పని చేసేవారు. నాకు 13 ఏళ్ల వయస్సులో మందుపాతర పేలి మా నాన్న చనిపోయారు. ప్రస్తుత నా పరిస్థితి కారణం వనమా రాఘవ. ఆయనకు మా అక్క మాధవితో గత 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. మా అక్క, అమ్మ సూర్యవతి, రాఘవా కలిసి నాకు రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారు. ఇటీవల పెద్ద మనుషుల సమక్షంలో ఆస్తిలో వాటాలు తేల్చుకున్నాం. అయితే వాటాలను పంచకుండా నా చావుకు కారణమయ్యారు’’ అని నాగ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఎట్టకేలకు పోలీసుల అదుపులోకి వనమా రాఘవ.. రాజమండ్రికి పారిపోతుండగా అరెస్ట్..
‘‘మా సొంత వూరు పోలవరం మండలం పాత పట్టిసీమ. మా స్వస్థలానికి ఎలాంటి సంబంధం లేని రాఘవ మా ఆస్తి పంపకాల విషయంలో జోక్యం చేసుకుని నన్ను తీవ్రంగా వేధించాడు. అక్కకు పోలవరంలో రెండు ఎకరాలు, రాజమండ్రిలో రెండు ఇళ్ల స్థలాలు, గోకవరంలో 200 గజాల స్థలం, అమ్మ రిటైర్‌మెంట్ డబ్బులో కూడా వాటా ఇచ్చాం. అయినా వాటాను పంచమని అడిగితే ఇబ్బందులకు గురిచేశారు. నేను రాజమండ్రిలో అద్దె ఇల్లులో ఉంటున్నా.
ఇద్దరు ఆడపిల్లలు. వారి చదువులు, కుటుంబం గడవడానికి సుమారు రూ.30లక్షలు అప్పులు చేశాను. వనమా రాఘవ ఉండగా నాకు న్యాయం జరగదు.దీంతో చేసేది లేక నా భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నా. ఈ వీడియో మీరు చూసే సమయానికి మేం బతికి ఉండం. నాకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దు.’’ అంటూ నాగ రామకృష్ణ ఆవేదనతో సెల్పీ వీడియో తీశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: ఎట్టేకేలకు వనమా రాఘవను సాగనంపిన టీఆర్ఎస్