రామచంద్రమూర్తి రాజీనామాకు కారణమిదేనా?

ప్రభుత్వ సలహాదారు, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సలహాదారుల పేరుతో వైసీపీ, సాక్షి మీడియా సంస్థలో పని చేసిన అనేక మందికి పోస్టులు ఇచ్చి రూ.లక్షల్లో జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పోస్టులు సలహాదారులకు ఉపాధి చూపడానికి తప్ప ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేదనే విమర్శలు కొద్ది నెలలుగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ సలహాదారుల పాత్ర ఏమీ […]

Written By: Neelambaram, Updated On : August 25, 2020 8:26 pm
Follow us on


ప్రభుత్వ సలహాదారు, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సలహాదారుల పేరుతో వైసీపీ, సాక్షి మీడియా సంస్థలో పని చేసిన అనేక మందికి పోస్టులు ఇచ్చి రూ.లక్షల్లో జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పోస్టులు సలహాదారులకు ఉపాధి చూపడానికి తప్ప ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేదనే విమర్శలు కొద్ది నెలలుగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ సలహాదారుల పాత్ర ఏమీ ఉండదు. జగన్ మీడియా సంస్థలో డైరెక్టర్ గా పని చేసిన రామచంద్రమూర్తిని పబ్లిక్ పాలసీ సలహాదారుడిగా జగన్ నియమించుకున్నారు.

Also Read: ఒంటరి పోరాటం చేస్తున్న చంద్రన్న..!

రామచంద్రమూర్తి నియామకం అయిన అనంతరం ఆయనకు ప్రతి నెలా జీతం చెల్లించడం తప్ప ఆయన సలహాలు, సూచనలు స్వీకరించిన సందర్భాలు ఒక్కటీ లేదు. దీంతో ఏడాది అనంతరం ఆయన మానసిక ఆవేదనకు గురై తన బాధను ప్రభుత్వ పెద్దలు కొందరి వద్ద వ్యక్తం చేసినట్లు నాలుగు నెలల కిందట ప్రచారం జరిగింది. అంతేకాదు… అప్పటి నుంచి ఆయన జీతం తీసుకోవడం లేదని సమాచారం. ఇప్పడున్న పరిస్థితిలో జగన్ ఇటువంటి విషయాలను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో రామచంద్రమూర్తి ఆవేదినపై పెద్దగా స్పందించలేదు.

Also Read: స్వర్ణ ప్యాలెస్ ఘటన.. జగన్ సర్కార్ కు షాక్

మరోవైపు సలహాదారుల పేరుతో ప్రభుత్వం ప్రజాధనం వృదా చేస్తుందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైసిపి ఎంపీ రాఘురామ కృష్ణంరాజు ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సిఎస్ కు లేఖ సైతం రాశారు. దీంతో ప్రభుత్వ సలహాదారుల విషయం వివాదాస్పదం అయ్యింది. ఈ సంఘటలనతో తాను సలహాదారుగా పని చేయడం భావ్యం కాదని నిర్ణయించుకున్న సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామాను ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజయ్ కల్లం కు అందజేశారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారుల వ్యవహారం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు… రామచంద్రమూర్తికి ఫోన్ చేసి అభినందించారు. ప్రభుత్వ సలహాదారులు అలంకారంగా మారారని, 14 నెలల కాలంలో సీఎం ఏ ఒక్క సలహాదారుడి సలహా స్వీకరించలేదన్నారు. వ్యక్తిత్వం ఉన్నవారెవరూ జగన్ పాలనలో ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగలేరని పేర్కొన్నారు. మిగిలిన సలహాదారులు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags