https://oktelugu.com/

ABN RK Varma: ఏబీఎన్ ఆర్కే, వర్మ.. ఇద్దరికీ తిక్కుంది.. వారి ఇంటర్వ్యూకు ఓ లెక్కుంది

Ram Gopal Varma Open Heart With RK: ఒకరేమో మీడియా టైకూన్.. ప్రభుత్వాలనే మార్చేసేంతగా మీడియా ద్వారా ముప్పుతిప్పలు పెట్టగల సీనియర్ జర్నలిస్టు.. మరొకరు ఏమో అస్సలు ఎవ్వరికీ భయపడని వివాదాస్పద దర్శకుడు.. ఇద్దరికీ తిక్కుంది. కానీ వాటికి లెక్కుంది.. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పగల మొండివారు వీరిద్దరూ.. ఇద్దరిదీ ఆధిపత్య భావాజాలం.. అలాంటి వారిద్దరూ కలిశారు. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవల సినిమా టికెట్ల వివాదంపై ఏపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2022 / 08:54 PM IST
    Follow us on

    Ram Gopal Varma Open Heart With RK: ఒకరేమో మీడియా టైకూన్.. ప్రభుత్వాలనే మార్చేసేంతగా మీడియా ద్వారా ముప్పుతిప్పలు పెట్టగల సీనియర్ జర్నలిస్టు.. మరొకరు ఏమో అస్సలు ఎవ్వరికీ భయపడని వివాదాస్పద దర్శకుడు.. ఇద్దరికీ తిక్కుంది. కానీ వాటికి లెక్కుంది.. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పగల మొండివారు వీరిద్దరూ.. ఇద్దరిదీ ఆధిపత్య భావాజాలం.. అలాంటి వారిద్దరూ కలిశారు. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవల సినిమా టికెట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అదిప్పుడు వైరల్ అయ్యింది.

    rk varma

    రాంగోపాల్ వర్మలో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటని ఏబీఎన్ ఆర్కే ప్రశ్నించగా.. వయసు పెరిగేకొద్దీ తనకు పరిణతి వస్తోందని.. బుద్దుడికి ఒక చెట్టుకింద అయినట్టు తనకు ఏదో ఒక బార్ లో జ్ఞానోదయం అయ్యిందని వర్మ చెప్పుకొచ్చాడు. ‘ఆ బార్ పేరు చెబితే జ్ఞానం రావాల్సినోళ్లు అక్కడికి వెళతారని’ ఆర్కే సెటైర్ వేశారు.

    ఇక ఏబీఎన్ ఆర్కే ప్రశ్నలకు వర్మ వేసిన పంచులు పేలాయి.. ఇతరుల మనోభావాలను మీరు ఎందుకు దెబ్బతీస్తారని ఆర్కే ప్రశ్నించాడు.. ‘దానికి మీ మొహం నచ్చలేదని నేనంటా.. నామీద కేసు పెట్టండి చూద్దాం’ అని వర్మ ఓ రకంగా ఆర్కేకు గట్టి పంచ్ ఇచ్చేశాడు.

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంత గ్రూపులు, ఆధిపత్యపు పోకడలు, ఈర్ష్యులు ఎక్కడా లేవని వర్మ సంచలన నిజాలను పంచుకున్నారు. వర్మకు ఏపీ ప్రభుత్వం ఎందుకు ఆహ్వానించి చర్చలు జరిపిందన్న ఆర్కే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘నాలాగా ఎవరూ ఒక్కరు టాలీవుడ్ ప్రముఖులు ట్వీట్లు పెట్టారా? ప్రశ్నించారా? నేను పెట్టాను కాబట్టే నాకు పిలుపు వచ్చిందని వర్మ చెప్పుకొచ్చాడు. మనం ప్రశ్నించకపోతే ప్రభుత్వం మన బెడ్ రూంలోకి వస్తుందని వర్మ హాట్ కామెంట్స్ చేశారు.

    బలిసి కొట్టుకుంటున్నామన్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి బలవకుండా ఎమ్మెల్యే అయ్యావా? అని వర్మ కౌంటర్ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ తో విభేదాలున్నా సినిమా టికెట్ల విషయంలో మాత్రం మీకు మెగా ఫ్యామిలీ మద్దతు దొరికిందన్న ప్రశ్నకు వర్మ సమాధానం ఇచ్చారు. గొడవలు, వివాదాలు ఎన్నో జరుగుతుంటాయని.. అవన్నీ సినీ ఇండస్ట్రీలో కామన్ అన్నారు.

    చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసిన వర్మ ఇప్పుడు జగన్ పై సినిమా తీయగలరా? అన్న ఆర్కే ప్రశ్నకు తన దగ్గర 2.30 గంటలు తీసే కథ లేదని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక ‘వైఎస్ వివేకా హత్య’ పై సినిమా తీస్తారా? అన్న దానికి వర్మ సైలెంట్ అయ్యారు. ఏం సమాధానం ఇచ్చాడన్నది ప్రోమో వీడియోలో హైడ్ చేశారు. ఇక వర్మ ఫోన్ పట్టడంపై వర్మ తిట్టిపోయగా.. మీరు ఎవరు నన్ను నిలదీయడానికి అని వర్మ కౌంటర్ ఇచ్చారు.

    ఇలా వర్మ తిక్కకు.. ఏబీఎన్ ఆర్కే దబాయింపుకు సరిగ్గా సెట్ అయ్యింది. ఇద్దరూ వివాదాస్పద ప్రశ్నలు, జవాబులు ఇస్తూ ప్రోమోను హీటెక్కించారు. ఈ ఫుల్ ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కానుంది. మరి వర్మ ఎలాంటి సమాధానాలిచ్చాడన్నది ఆసక్తి రేపుతోంది.