RGV Etela: ‘ఈటల వెన్నుపోటు’ సినిమాపై రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన

RGV Etela: తెలుగు నాట నిప్పు లేకుండానే పొగ పుట్టించగల సామర్థం వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సొంతం. ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించేలా నేతల బయోపిక్ లు తీస్తూ వారికి కాకరేపుతున్నాడు. ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్’, చంద్రబాబు వెన్నుపోటు, కడప రెడ్లు, పవర్ స్టార్ అంటూ ఏపీ నేతలను టార్గెట్ చేసి వర్మ తీసిన సినిమాలకు కొదవేలేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై వర్మ పడ్డాడు. తెలంగాణ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ మీద సినిమా […]

Written By: NARESH, Updated On : October 21, 2021 6:41 pm
Follow us on

RGV Etela: తెలుగు నాట నిప్పు లేకుండానే పొగ పుట్టించగల సామర్థం వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సొంతం. ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించేలా నేతల బయోపిక్ లు తీస్తూ వారికి కాకరేపుతున్నాడు. ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్’, చంద్రబాబు వెన్నుపోటు, కడప రెడ్లు, పవర్ స్టార్ అంటూ ఏపీ నేతలను టార్గెట్ చేసి వర్మ తీసిన సినిమాలకు కొదవేలేదు.

etela movie ram gopal varma

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై వర్మ పడ్డాడు. తెలంగాణ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ మీద సినిమా తీస్తున్నాడు. ఇటీవలే వరంగల్ వెళ్లి అక్కడా కొండా సినిమా షూటింగ్ లో నిమగ్నమయ్యాడు.

ఈ క్రమంలోనే వర్మ పేరుతో తాజాగా ఒక సోషల్ మీడియా పోస్టు వైరల్ అయ్యింది. వర్మ ట్వీట్ చేసినట్టుగా ‘నాకెండుకో ఈటల రాజేందర్ కేసీఆర్ కు వెన్నుపోటు ఎపిసోడ్..చంద్రబాబు ఎన్టీఆర్ వెన్నుపోటు సేమ్ అనిపించింది. అందుకే ఈ ఈటల రాజేందర్ కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన విధానంపై తెలంగాణ రాజకీయ మేధావులతో చర్చించి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా పేరు ‘వెన్నుపోటు ఈటలు’’ అని క్లారిటీ ఇచ్చారు.

వెన్నుపోటు రాజకీయాలపై ఇప్పటికే సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు ఈటల రాజేందర్ పై సినిమా చేస్తున్నారన్న ఒక ట్వీట్ వైరల్ అయ్యింది. ఈ ట్వీట్ వర్మ కు కూడా చేరడంతో ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన పేరుతో కొందరు అకౌంట్ క్రియేట్ చేసి ఆ పోస్టర్ ను వదిలారని.. తాను ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై ఎలాంటి సినిమాలు చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది ఫేక్ వార్త అంటూ క్లారిటీ ఇచ్చాడు.