https://oktelugu.com/

రాజకీయాల్లోకి వచ్చేందుకు జంకుతున్న రజనీ?

తమిళనాడులో త్వరలోనే ఎన్నికల శంఖారావం మోగనుంది. దీంతో తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ అందుకు తగ్గట్టుగా సన్నహాలు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు ఇప్పటికే పొత్తులపై క్లారిటీకి వచ్చాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను కూడా ప్రారంభించాయి. దేవుడి శాసిస్తే.. అరుణాచలం పాటిస్తాడు.. అని చెప్పే రజనీకాంత్ పార్టీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనేది సస్పెన్స్ థ్రిలర్ ను తలపిస్తోంది. ఎన్నికల్లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 20, 2020 / 04:39 PM IST
    Follow us on


    తమిళనాడులో త్వరలోనే ఎన్నికల శంఖారావం మోగనుంది. దీంతో తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ అందుకు తగ్గట్టుగా సన్నహాలు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు ఇప్పటికే పొత్తులపై క్లారిటీకి వచ్చాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను కూడా ప్రారంభించాయి. దేవుడి శాసిస్తే.. అరుణాచలం పాటిస్తాడు.. అని చెప్పే రజనీకాంత్ పార్టీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనేది సస్పెన్స్ థ్రిలర్ ను తలపిస్తోంది. ఎన్నికల్లో పోటీపై రజనీకాంత్ ఇప్పటివరకు తన మనస్సులోని బయట పెట్టకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

    Also Read: సోనియా కుటుంబానికి ఎంత బాధ..!?

    రాజకీయాలపై అంతగా అవగాహన లేని రజనీకాంత్ నేతల మైండ్ గేమ్ కు చిత్తవుతున్నారు. దీంతోనే ఆయన పార్టీ ప్రకటనపై వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2021 ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని గతంలో ప్రకటించిన రజనీకాంత్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాను సమర్థుడైన నాయకుడిని ముఖ్యమంత్రి చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నానని.. తనకు ముఖ్యమంత్రి పదవీ కావాలనే ఆశలేదని ముందుగానే ప్రకటించడంతో రజనీ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ ప్రకటనకు ముందే రజనీ క్యాడర్లో నిస్తేజాన్ని నింపినట్లయింది.

    అయితే కొన్నాళ్లుగా రజనీ అనుచరులు, అభిమానులు మక్కల్ మండ్రంను స్థాపించి సభ్యత్వాలను చేస్తున్నారు. తీరా ఎన్నికలకు గడువు సమీపిస్తున్నప్పటికీ రజనీ నుంచి పార్టీ ప్రకటన రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. దివంగత సీఎం జయలలిత మరణంతో రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. దశాబ్దాలుగా ప్రజలు అన్నాడీఎంకే, డీఎంకే పాలన చూసి విసిగిపోయారు. ఇలాంటి తరుణంలో రజనీ వస్తే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా రజనీ మారుతారని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు.

    Also Read: ఇద్దరు మిత్రులే కానీ.. నీళ్ల వద్దే పంచాయితీ..!

    రజనీ పార్టీ ప్రకటిస్తారని అలర్ట్ అయిన అధికార, ప్రతిపక్ష పార్టీలు రజనీ స్థానికేతరుడు అంటూ ప్రచారం చేస్తుండటంతో ఆయన పోటీకి వెనక్కి తగ్గారనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో గెలిచే అంతా సమయం లేదని భావిస్తున్నారు. ఇతర పార్టీలతో పోత్తు పెట్టుకునే అవకాశం లేకపోవడంతో రజనీ ఈసారి పోటీకి వెనుకడుగు వేస్తున్నట్లు కన్పిస్తోంది. దీంతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలే మధ్య పోటీ కన్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రజనీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదో అనేది అభిమానులకైనా క్లారిటీ ఇస్తే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దీంతో రజనీని ఈసారి కూడా దేవుడు శాసించలేదా? అనే సైటర్లు విన్పిస్తున్నాయి.