Rajasthan Twins Died : కొన్ని యాదృశ్చికంగా జరుగుతాయో లేక ఏదైనా బలమైన కారణం ఉందో తెలియదు. కానీ ఆ మిస్టరీలు ఇప్పటికీ కూడా అంతుబట్టడం లేదు. దాదాపు 900 కి.మీల దూరంలో విడివిడిగా ఉన్న కవలలు కొన్ని గంటల వ్యవధిలో వింతగా మరణించారు. ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు ఎలా చనిపోయారన్నది తేలలేదు. రాజస్థాన్‌లో 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న కవలలు కొన్ని గంటల వ్యవధిలో వింతగా మరణించారు ఈ విచిత్రమైన సంఘటనలో రాజస్థాన్‌లో జరిగింది.
ఒకే రోజు 26 ఏళ్ల కవలలు ఒకే విధంగా మరణించారు. ఒకరికొకరు 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు, ఒకరు బార్మర్‌లో ఉండగా.. మరొకరు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో నివసిస్తున్నారు. సోదరులు ఇద్దరూ ఒకే రీతిలో విచిత్రంగా మరణించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఒకరు తన ఇంటి టెర్రస్ నుండి జారిపడి మరణించగా.. మరొకరు వాటర్ ట్యాంక్‌లోకి జారిపోయి చనిపోయారు.రాజస్థాన్ కు చెందిన ఇద్దరు కవలలు సోహన్ సింగ్ మరియు సుమేర్ సింగ్‌లను వారి స్వగ్రామమైన సార్నో కా తాలాలో ఒకే చితిపై దహనం చేశారు.
సుమేర్ గుజరాత్‌లోని టెక్స్‌టైల్ సిటీలో పనిచేస్తున్నాడు. సోహన్ జైపూర్‌లో గ్రేడ్ -2 టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.. “బుధవారం రాత్రి సుమెర్ ఫోన్‌లో మాట్లాడుతూ జారిపడి చనిపోయాడు. సోహన్ గురువారం తెల్లవారుజామున తన కవలల మరణవార్తకు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే వాటర్ ట్యాంక్‌లో పడిపోయాడు. రెండు కేసులలో ఆత్మహత్యను తోసిపుచ్చడం లేదు” అని బార్మర్‌లోని సింధారి పోలీసులు తెలిపారు.
ఇద్దరిలో పెద్ద అయిన సోహన్ తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న ట్యాంక్ నుండి నీరు తీసుకురావడానికి బయలుదేరాడు. అనంతరం ట్యాంక్‌లో కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సుమెర్ తన సోదరుడిని కష్టపడి చదివించి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సంపాదించేలా చేయాలని సూరత్ వెళ్లి మరీ పనిచేస్తున్నాడు. ఇలా అన్నాదమ్ములు ఒకేసారి మరణించడం విషాదం నింపింది.