Rajahmundry Janasena MP Candidate: జనసేన పార్టీ రాష్ట్రంలో పాగా వేయాలని ఆలోచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన ప్రబావం చూపించి అధికారం చేజిక్కించుకోవాలని అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ర్ట వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని ఆలోచించినా చివరి క్షణంలో వాయిదా వేసుకుంది. కానీ అధికారం కోసం ఉన్న మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ పక్కా స్కెచ్ వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

బస్సు యాత్ర వాయిదాకు కూడా కారణాలు ఉన్నాయి. పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన తరువాత బస్సు యాత్ర చేపడితే ప్రయోజనం ఉంటుందని భావించే కొంతకాలం వాయిదా వేసి తరువాత చేపట్టాలని చూస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది. అందుకే అభ్యర్థుల ప్రకటనకు ఉపక్రమించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని కూడా ఆశిస్తున్నారు. దాదాపు పొత్తుపై అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి పట్టు ఉంది. దీంతో ఇక్కడ నుంచే పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తున్నారు.
రాజమండ్రి సీటుపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. టీ టైం ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్న వ్యాపారిగా మురళి అనే యువకుడికి మంచి పేరుంది. దీంతో అతడినే రాజమండ్రి సీటు కోసం ఎంపిక చేయనున్నట్లు చెబుతున్నారు. దాదాపుగా అతడి పేరు ఖరారైనట్లు సమాచారం. కచ్చితంగా ఆ యువకుడికే రాజమండ్రి సీటు కేటాయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి పార్టమెంట్ అభ్యర్థిగా టీ టైం మురళినే ఎంపిక చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీ వ్యాపారంలో మురళి ఎంతో ప్రాచుర్యం పొందాడు. దీంతో అతడికి టికెట్ కేటాయిస్తే విజయం ఖాయమనే వాదనలు కూడా వస్తున్నాయి.

జనసేన పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన తరువాత పార్టీని విస్తరించాలని బావిస్తోంది. ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో మంచి జోష్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇందుకోసమే అభ్యర్థులను డిక్లేర్ చేసి తరువాత పార్టీ కార్యక్రమాలను వేగంగా నిర్వహించాలని ఆలోచిస్తోంది. దీంతో జనసేన పార్టీని విస్తరించి ప్రజల్లో పట్టు సాధించాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా ప్రచారం చేయడానికి సిద్ధపడుతోంది.