Raja Singh: ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతోంది? అధికార పార్టీ బీజేపీకి ఓట్లు పడలేదనే సాకుతో బీజేపీ డైలమాలో పడుతోంది. దీంతో పార్టీలో భయం పెరుగుతోంది. ఎలాగైనా పార్టీని అధికారంలో నిలపాలని చూసినా సాధ్యం కాలేదని తెలియడంతో బీజేపీ నాయకుల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఓటర్లను చెడా మడా తిట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నేతల తీరుతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం లేదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉత్తరప్రదేశ్ లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలతో ఇంకా పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీ ప్రజలకు గత్యంతరం లేదని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిన హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. బీజేపీకి ఓటు వేయకపోతే అందరిని తరిమి కొడతామని బెదరించడం భయం కలిగిస్తోంది.
జేసీబీలు, బుల్ డోజర్లు సిద్ధంగా ఉన్నాయని ఓటు వేయకపోతే ఇక దాడులే శరణ్యమని చెబుతున్నారు.దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఓటర్లను బెదిరింపులకు గురిచేయడంతో పార్టీ భవితవ్యం అంధకారంలో పడినట్లు అవుతోంది. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.
Also Read: షర్మిల అరెస్టుతో ఏం జరుగుతోంది?
యూపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీలో ఆందోళన పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లను మాటలతో భయపెట్టడంతో ఇప్పుడు వేసే ఓట్లు కూడా పడవనే సంకేతాలు వస్తున్నాయి. అధిష్టానం బీజేపీ నేతలను అదుపులో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓట్లు అడిగే హక్కు ఉంటుంది. ఓటర్లు కూడా తమ ఇష్టమైన వారికి ఓటు వేసే అధికారం ఉంటుందని తెలుసుకోవాలి. అంతేకాని బెదిరింపులతో ఓట్లు రాలవు అనే విషయం మరిచిపోవడం ఆశ్చర్యకరమే.
Also Read: జగన్ తో ‘మంచు విష్ణు’ భేటీ.. చడీ చప్పుడు లేని సమావేశం దేనికి ?