spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Southwest Monsoon: ఏపీలో నేటి నుంచి వర్షాలు.. చురుగ్గా రుతు పవనాలు

Southwest Monsoon: ఏపీలో నేటి నుంచి వర్షాలు.. చురుగ్గా రుతు పవనాలు

Southwest Monsoon: ఏపీ ప్రజలకు శుభవార్త. శనివారం నుంచి రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి. రుతుపవనాలు ప్రవేశించడంతో వానలు ప్రారంభంకానున్నాయి. శనివారం మధ్యాహ్నంలోగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రంతో పాటు పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళకు మూడు రోజులు ముందుగానే వచ్చిన రుతుపవనాలు జూన్‌ 7న రాష్ట్రానికి విస్తరించాల్సి ఉన్నా.. వాతావరణం అనుకూలించక జాప్యమైంది.వారం రోజులుగా దక్షిణ కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గోవా వరకు వ్యాపించాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి ఆవరించి ఉన్నందున శుక్ర, శని వారాల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. దక్షిణ ఆంధ్రలో ఒకట్రెండు చోట్ల వడగాడ్పులు వీయొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Southwest Monsoon
Southwest Monsoon

మూడు రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్
మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది. రుతుపవనాలు మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని కవర్ చేశాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ రెడ్ అలర్ట్ అనేది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలకు హెచ్చరికగా ఉంది. అధిక వర్షపాతం కారణంగా సాధ్యమయ్యే సంఘటనలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఇది సూచిస్తుంది.

Also Read: Balakrishna- Gopichand Malineni: క్రాక్ డైరెక్టర్… బాలయ్యతో అఖండ 2 తీస్తున్నాడా?

Southwest Monsoon
Southwest Monsoon

ఇప్పటికే ఆ మూడు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మే నుంచి మూడు రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాలకు 43 మంది మృత్యువాత పడ్డారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మేఘాలయలోని గారో హిల్స్‌లో గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, రెండున్నరేళ్ల చిన్నారితో నలుగురు వ్యక్తులు సజీవ సమాధి అయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

Also Read:Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో విజయానికి 1.2% ఓట్ల దూరంలో ఎన్‌డీఏ.. అయినా బీజేపీ వైపే మొగ్గు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు ఆ రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాడట…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే...
National Flag Day

National Flag Day: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా.. ప్రేరణాత్మక ప్రయాణం!

National Flag Day: భారత జాతీయ జెండా కేవలం మూడు రంగుల వస్త్రం కాదు. అది మన స్వాతంత్య్ర సంగ్రామం ఆశలు, త్యాగాలు, ఐక్యత, భవిష్యత్తు కలలను ప్రతిబింబించే చిహ్నం. 1947 జూలై...
Pawan Kalyan

Pawan Kalyan: ప్రకాశం జిల్లాకు మహర్దశ.. దశాబ్దాల సమస్యని పరిష్కరించిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: దశాబ్దాలు గా ప్రకాశం జిల్లా వాసులు ఎదురుకుంటున్న సమస్యలకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎన్నో...
iQOO Z11 Lite 5G

iQOO Z11 Lite 5G: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి రానున్న కొత్త ఫోన్..

iQOO Z11 Lite 5G:  ప్రస్తుతం చాలా మంది ఫోన్ కొనే సమయంలో బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఎక్కువ మన్నిక గల బ్యాటరీ ఉన్న ఫోన్ ధరలు అధికంగా ఉంటున్నారు....
Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Oktelugu Epaper