నిర్మల్ జిల్లాలో వర్షం బీభత్సం చేసింది. భైంసా డివిజన్ లో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. భైంసా మండలం మహాగావ్-గుండెగావ్ గ్రామాల మధ్య బ్రిడ్జి వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కుభీర్ మండల కేంద్రంలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేదరి గల్లీలో వరద నీటిలో చిక్కుకున్న ఎనిమిది మందిని స్థానికుల సాయంతో పోలీసులు రక్షించారు. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సును కూడా సురక్షితంగా బయటకు తీశారు.
రుతుపవనాలు చురుకుగా కదలడంతో రెండు మూడు రోజుల్లో రెండు స్టేట్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రెండు ప్రాంతాల్లో వర్షప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు.
తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు అస్థిరంగా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. దీంతో ఇంకా తెలుగు ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రాజక్టులు సైతం నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. లోయర్ మానేరు డ్యాం గేట్టు ఎత్తి నీటిని దిగువకు వదులున్నారు. ఇంకా రాష్ర్టంలోని ప్రాజెక్టులన్ని జలకళను సంతరించుకుంటున్నాయి.