https://oktelugu.com/

యూపీ ఉద్రిక్తం.. పోస్టుమార్టంలో దారుణ విషయాలు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో అత్యాచారానికి గురైన బాలక వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. కాగా హత్యాచార బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. బాధితురాలిని దారుణంగా హింసించి చంపారని.. యువతి మెడ ఎముక విరిగినట్లు వైద్యులు తేల్చారు. Also Read: అప్పుల్లో కేంద్రం.. ఇక ప్రజలకు ప్యాకేజీలు లేవట? తాజాగా యూపీలో రాహుల్ గాంధీ, ప్రియాంక సైతం పర్యటించడానికి వెళ్లగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో 144 […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 02:21 PM IST
    Follow us on

    ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో అత్యాచారానికి గురైన బాలక వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. కాగా హత్యాచార బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. బాధితురాలిని దారుణంగా హింసించి చంపారని.. యువతి మెడ ఎముక విరిగినట్లు వైద్యులు తేల్చారు.

    Also Read: అప్పుల్లో కేంద్రం.. ఇక ప్రజలకు ప్యాకేజీలు లేవట?

    తాజాగా యూపీలో రాహుల్ గాంధీ, ప్రియాంక సైతం పర్యటించడానికి వెళ్లగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. యూపీ అంతటా ఇప్పుడు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.

    యూపీలో ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన రేకెత్తింది.మహిళా లోకం భగ్గుమంది. యూపీ అట్టుడుకింది. పార్టీలు, ప్రతిపక్షాలు బాధితులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.. దీంతో బాధితురాలి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం కూడా వివాదాస్పదైంది..

    Also Read: ట్రంప్ సర్కార్ కు మరో షాక్..

    బాధితురాలి కుటుంబానికి మద్దతుగా తాజాగా రాహుల్, ప్రియాంక పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని పోలీసుల వాహనానికి కాంగ్రెస్ వాహనాలకు అడ్డుపడ్డారు. కాంగ్రెస్ నేతలు, బాధితులు, మహిళల ఆందోళనలతో యూపీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  కాగా ప్రధాని మోడీ ఈ రేప్ కేసు బాధితులను కఠినంగా శిక్షించాలని యూపీ సీఎం యోగిని ఆదేశించారు.