
బీజేపీని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇప్పటికే ఢిల్లీలో కేజ్రీవాల్ ను.. ఏపీలో వైఎస్ జగన్ ను, తమిళనాడులో స్టాలిన్ ను.. తాజాగా బెంగాల్ లో మమతా బెనర్జీని గెలిపించి చరిత్ర సృష్టించాడు ప్రశాంత్ కిషోర్ (పీకే). పీకే స్కెచ్ గీస్తే ఆ రాష్ట్రంలో ఆ పార్టీ గెలవాల్సిందే.
ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగానే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని బీజేపీని ఓడించే పార్టీలతోనే జట్టుకట్టి కమల దళానికి కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఇప్పుడు తన టార్గెట్ ను జాతీయ రాజకీయాలపై మరల్చాడు.
తాజాగా ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశాడు. 2024 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి గా రాహుల్ గాంధీ నీ ప్రకటిస్తే రాహుల్ కోసం పనిచేయడానికి సిద్ధంమని ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాలను షేక్ చేసే ప్రకటన చేశాడు. కేంద్రంలోని మోడీ సర్కార్ అసంబద్ద విధానాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటి కావాలని.. కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాడు.
రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే ఆయన గెలుపు బాధ్యతను తాను భుజాన వేసుకుంటానని ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదనను కాంగ్రెస్ కు ఇచ్చాడు. రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ కు మద్దతుగా నిలబెడుతానని ప్రకటించారు.
పీకే చేసిన ప్రకటన ఖచ్చితంగా జాతీయ రాజకీయాలను షేక్ చేసేలా ఉంది. ఇన్నాళ్లు కేంద్రంలో ఎదురులేకుండా ఉన్న బీజేపీకి ఈ ప్రకటన షాకింగ్ లా మారింది. నిజంగా కాంగ్రెస్ కనుక రాహుల్ ను ప్రధాని అభ్యర్తిగా ప్రకటిస్తే.. ప్రాంతీయ పార్టీలు మద్దతు కూడగడితే.. పీకే రంగంలోకి దిగితే దేశ రాజకీయాలు మారినా మారొచ్చని అంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..