Rahul Sensational Comments : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం జరిగిన ఓ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పడం లేదు. ఎంతమంది ఉగ్రవాదులను మట్టుపెట్టారో వివరించడం లేదు. ఇలాంటి సమయంలో గెలిచామని చెప్పడం సరికాదు. వాస్తవానికి గెలిచే సమయంలో సరైన అయిపోయారు. నరేందర్ సరెండర్ అనగానే యుద్ధాన్ని ఆపేశారు. అమెరికా ఒత్తిడి వల్ల గెలిచే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. ఇది దేశం సమస్య. ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. నేను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడుగుతున్నాను.. ఇలా ఎందుకు చేశారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి. ఎందుకు ఒత్తిడికి తలవంచారు.. తలవంచాల్సిన అవసరం ఏం వచ్చింది. ఇలాంటి పరిస్థితి దేనికి మంచిదని” రాహుల్ గాంధీ ప్రశ్నించారు.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాలలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Also Read : జైశంకర్ పై దేశద్రోహ ఆరోపణలతో సెల్ఫ్ గోల్ వేసుకున్న రాహుల్ గాంధీ
ఆపరేషన్ సిందూర్ సమయంలో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించినప్పుడు అన్ని పార్టీలు హాజరయ్యాయి. అని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. ఇక ఇటీవల కాలంలో మన దేశం నుంచి మైనారిటీ ఎంపీలు మొత్తం ఇస్లాం దేశాలలో పర్యటిస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద వ్యవహారాలను ఎండగడుతున్నారు. ప్రపంచ దేశాల ముందు ఆ దేశం చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను వివరిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ అర్ధాంతరంగా ముగిసిపోవడంతో ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తన స్వరాన్ని పెంచింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటివారు తీవ్రస్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఆపరేషన్ సిందూర్ ఎవరి ఒత్తిడి వల్ల నిలుపుదల చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పాకిస్తాన్ పై గెలిచే సమయంలో ఎందుకు తలవంచారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వంటి వారు కూడా ఇదే స్థాయిలో నరేంద్ర మోడీని ప్రశ్నించడం విశేషం.
రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బిజెపి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. అసలు ఉగ్రవాద దేశంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడేందుకు కారణం ఎవరు? దేశ ప్రజలకు చెప్పాలని రాహుల్ గాంధీని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నాడు ఉగ్రవాద దేశానికి సంబంధించిన సైనికులను ఎందుకు వారికి అప్పగించారని.. నాడు ఏం జరిగిందని.. ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ పై ఉందని బిజెపి నాయకులు అంటున్నారు
నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
ట్రంప్ మోడీకి ఫోన్ చేసి "నరేందర్ సరెండర్" అని చెప్పగానే నరేంద్ర మోదీ యుద్ధం విరమించుకున్నాడు – రాహుల్ గాంధీ pic.twitter.com/nF085RUzTk
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2025